India vs England: టీం ఇండియా ఆటగాళ్లు బయో బుడగల్లో ఉండటం వల్ల మానసికంగా అలసిపోతున్నారని అందుకోసం వారికి రెండు వారాలు సెలవులు ఇవ్వాలని కోచ్ రవిశాస్తి అభిప్రాయపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ముగిశాక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని చెబుతున్నాడు. ఐపీఎల్ 2020 ముగియగానే ప్లేయర్లు సవాళ్లతో కూడుకున్న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారని అక్కడ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చోటు కోసం ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీసులు ఆడుతున్నారని అన్నారు. 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల్లో తలపడుతున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఏదో ఒక సమయంలో విరామం తీసుకోవాలని చెబుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీసు తర్వాత కుర్రాళ్లు ఐపీఎల్‌కు వెళ్తారు. ఆ సీజన్ తర్వాతా రెండు వారాలు విరామం అవసరమంటున్నాడు. ఎంతైనా మనం మనుషులమే కదా అని గుర్తుచేస్తున్నాడు. ఇండియా తరపున ఆడటానికి ఎంతోమంది ఆటగాళ్లు ఉన్నారని, అన్ని ఫార్మాట్లకు సరిపడేలా రిజర్వు ప్లేయర్స్ ఉన్నట్లు తెలిపారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో భారత్ మెరుగైన ప్రదర్శనే ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
India vs England: టీమ్ ఇండియా నిర్ణయం సరైనది కాదు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..