Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్.. గాయాన్ని కూడా లెక్కచేయలేగా.!

Tilak Varma Surgery Recovery: టీమిండియా యంగ్ ప్లేయర్ తెలుగబ్బాయ్ తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కానీ తాజాగా ఆయన ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో ఫిట్‌నెస్ పురోగతిపై పనిచేయనున్నాడు. ఈక్రమంలో ఓ గుడ్‌న్యూస్ వచ్చింది.

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్.. గాయాన్ని కూడా లెక్కచేయలేగా.!
Hardik Tilak

Updated on: Jan 21, 2026 | 7:36 AM

Tilak Varma Injury Update: టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న వేళ టీమ్ ఇండియాకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం కారణంగా గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన యువ సంచలనం తిలక్ వర్మ కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ పరీక్షల నిమిత్తం ఆయన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరనున్నట్లు సమాచారం. తిలక్ రాకతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.

కోలుకుంటున్న తిలక్ వర్మ..

భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స కారణంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమైన ఆయన, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. తాజా నివేదికల ప్రకారం, తిలక్ వర్మ మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో చేరనున్నాడు. అక్కడ ఆయనకు తుది దశ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నాడు.

ప్రపంచకప్‌కు ముందే శుభవార్త..

మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో, తిలక్ వర్మ కోలుకోవడం భారత జట్టుకు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి నొప్పి లేదని, ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభించారని సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. జనవరి 28న విశాఖపట్నంలో జరగనున్న నాలుగో టీ20 నాటికి ఆయన జట్టుతో చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా ఓటమికి అతిపెద్ద విలన్ ఇతడే.. కట్‌చేస్తే.. వన్డేల నుంచి రిటైర్మెంట్?

జట్టులో కీలక మార్పులు..

తిలక్ వర్మ గైర్హాజరీలో మొదటి మూడు టీ20లకు శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడటంతో అతని స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల నొప్పితో బాధపడుతుండటంతో ఆయన కూడా బెంగళూరులోని CoE లో చికిత్స పొందనున్నాడు.

రవి బిష్ణోయ్ రీ-ఎంట్రీ..

వాషింగ్టన్ సుందర్ స్థానంలో వచ్చిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ గత ఏడాది కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 42 అంతర్జాతీయ టీ20ల్లో 61 వికెట్లు తీసిన రికార్డు ఆయనకుంది. ఫిబ్రవరి 2025లో ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడిన బిష్ణోయ్, ఇప్పుడు మరోసారి కివీస్‌పై తన మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమయ్యాడు.

ఇది కూడా చదవండి: సూర్య లేదా బుమ్రా కాదు.. 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్ అతడే.. ప్రత్యర్థులకు పీడకల ఈ తోపు?

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ముందు కీలక ఆటగాళ్లు గాయపడటం ఆందోళన కలిగించినప్పటికీ, తిలక్ వర్మ వంటి ఆటగాడు త్వరగా కోలుకోవడం గంభీర్ సేనకు పెద్ద ఊరట. తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధిస్తే, ప్రపంచకప్‌లో భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..