
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు భువనేశ్వర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తన పదునైన అవుట్ స్వింగర్లతో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముందుగా ప్రమాదకరమైన ర్యాన్ రికెల్టన్‌ను పెవిలియన్ పంపిన భువీ, ఆ తర్వాత విధ్వంసకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను (22) అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతటితో ఆగకుండా, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు.
ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్లతో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో 20 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేర్వేరు సీజన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో యుజువేంద్ర చాహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఈ ఘనత సాధించాడు. భువీ ఈ ఘనతను 2014, 2016, 2017, ఇప్పుడు 2026 సీజన్లలో సాధించడం అతని నిలకడకు నిదర్శనం.
యుజువేంద్ర చాహల్: 5 సీజన్లు
లసిత్ మలింగ: 4 సీజన్లు
జస్ప్రీత్ బుమ్రా: 4 సీజన్లు
భువనేశ్వర్ కుమార్: 4 సీజన్లు
ప్రస్తుత కాలంలో యువ బౌలర్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నప్పటికీ, భువనేశ్వర్ మాత్రం తన పాత పద్ధతిలోనే స్వింగ్, ఖచ్చితత్వంతో వికెట్లు తీస్తున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను తికమక పెట్టడంలో భువీ శైలే వేరు. ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో భువీ వేసిన బంతులు చూస్తుంటే 2016 నాటి పాత భువనేశ్వర్‌ను గుర్తుకు తెచ్చాయి. అతని అనుభవం ఆర్సీబీ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.
లీగ్ దశ ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు శుభపరిణామం. ఒత్తిడిలో ఎలా బౌలింగ్ చేయాలో తెలిసిన భువీ, వరుసగా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో జట్టును ప్లేఆఫ్స్ రేసులో నిలబెడుతున్నాడు. పెద్ద పెద్ద హిట్టర్లు ఉన్న జట్లను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భువీ పాత్ర కీలకం కానుంది. మొత్తానికి రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ తన మార్క్ స్వింగ్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..