వరల్డ్‌కప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఆరంభంలోనే తడబడిన ఇంగ్లాండ్.. 44.4 ఓవర్లకు 221 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో కంగారూల జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 100 పరుగులు, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53 పరుగులు, 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా చివర్లో దూకుడుగా ఆడటంతో ఆతిధ్య ఇంగ్లాండ్ ఎదుట భారీ స్కోర్ ఉంచగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా… జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీలు తలో 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ (115 బంతుల్లో 89 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తుండడంతో ఇంగ్లాండ్ గెలిచేందుకు మార్గం సుగమం అయింది. కానీ స్టోక్స్ ఔటయ్యాక.. ఆతిధ్య జట్టు ఏదశలోనూ కోలుకోలేదు.క్రమంగా వికెట్లు పడుతూ ఉండటంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా, మిచెల్ స్టార్క్ 4 వికెట్ల పడగొట్టాడు.