Jay Shah Appointed : బీసీసీఐ కార్యదర్శి జే షాను మరో పదవి వరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఇంతకాలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ నజ్ముల్ హసన్ వ్యవహరించారు. జే షా ఇప్పుడు ఆ బాధ్యతలను చేపట్టనున్నారు.
ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జేషాకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జే షాతో కలిసి చాలా దగ్గరగా పనిచేశానని, ఆయన ప్రణాళిక, క్రికెట్ అభివృద్ధిపై ఆయన దృష్టికోణం గుంచి తనకు తెలుసని గంగూలీ పేర్కొన్నాడు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇవాళ్టి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఏసీసీ చీఫ్‌గా షా ఎన్నికైన అనంతరం మాట్లాడారు. ఈ ప్రాంతంలో క్రికెట్ నిర్వహణ, అభివృద్ధి, ప్రమోషన్‌కు ఉద్దేశించిన ఏసీసీ స్థిరంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
Next IPL : ఐపీఎల్ 2021 ప్రత్యామ్నాయ వేదికపై బీసీసీఐ కీలక ప్రకటన.. యూఏఈ కన్నా భారతే భద్రమైనది..
టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచండి.. కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..