Michael Schumacher Documentary : ఫార్ములావన్‌ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ జీవితంపై డాక్యుమెంటరీ.. కొత్త సంగతులను మోసుకొస్తున్న చిత్రం..

ధోనీ జీవిత చరిత్రపై సినిమా చూశాం.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పై కూడా అద్భుత చిత్రం తెరకెక్కింది. అయితే తాజాగా ఫార్ములావన్‌ రేసింగ్​ దిగ్గజం..

Michael Schumacher Documentary : ఫార్ములావన్‌ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ జీవితంపై డాక్యుమెంటరీ.. కొత్త సంగతులను మోసుకొస్తున్న చిత్రం..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:31 PM

Michael Schumacher Documentary : ధోనీ జీవిత చరిత్రపై సినిమా చూశాం.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పై కూడా అద్భుత చిత్రం తెరకెక్కింది. అయితే తాజాగా ఫార్ములావన్‌ రేసింగ్​ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ జీవితంపై త్వరలోనే ఓ డాక్యుమెంటరీ రానుంది. ఏడుసార్లు ఎఫ్‌1 విశ్వవిజేతగా నిలిచాడు. 2013లో షూమాకర్‌ ఒక రేసులో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు బయటి ప్రపంచానికి కనపడలేదు. కుటుంబసభ్యులు షుమాకర్‌కు జెనివాలోనే చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే.. మైఖేల్‌ వెక్‌-బ్రూనో కమర్టన్స్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. షుమాకర్‌ భార్య వారికి తమ ప్రైవేట్‌ రికార్డింగ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్గజ రేసర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు ఈ డాక్యుమెంటరీ పెద్ద ఉపశమనం కలిగించనుంది.ఈ లఘుచిత్రం.. గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా ఆలస్యమైంది.

ఇదిలావుంటే.. గత ఏడాది డిసెంబర్‌లో బహ్రెయిన్ వేదికగా జరిగిన చివరి రేసులో దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ కుమారుడు మైక్​ షూమాకర్​ఎఫ్‌2 టైటిల్‌ గెలిచాడు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..