Team India: గర్ల్ ఫ్రెండ్‌కే కాదు, ఫ్యామిలీకి నో ఎంట్రీ.. టీమిండియా ప్లేయర్లకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ సమయంలో ఆటగాళ్లను వారి కుటుంబాలతో ఉండనివ్వకూడదనే ప్రస్తుత విధానానికే కట్టుబడి ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్ణయించింది. టీం ఇండియా ఆటగాళ్లు అభ్యర్థనలు చేసినా.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోలేదు. ప్రధాన టోర్నమెంట్ల కోసం ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించకూడదని బోర్డు నిర్ణయించింది.

Team India: గర్ల్ ఫ్రెండ్‌కే కాదు, ఫ్యామిలీకి నో ఎంట్రీ.. టీమిండియా ప్లేయర్లకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ..
Team India

Updated on: Feb 10, 2026 | 7:09 PM

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ సమయంలో ఆటగాళ్లను వారి కుటుంబాలతో ఉండనివ్వకూడదనే ప్రస్తుత విధానానికే కట్టుబడి ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్ణయించింది. టీం ఇండియా ఆటగాళ్లు అభ్యర్థనలు చేసినా.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోలేదు. ప్రధాన టోర్నమెంట్ల కోసం ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించకూడదని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ల రిక్వెస్ కూడా ఒప్పుకోలేదంట.

ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన తర్వాత విదేశీ పర్యటనలతోపాటు, కీలక టోర్నమెంట్ల సమయంలో ఫ్యామిలీతో కలిసి ఉండడంపై బీసీసీఐ కఠినమైన నియమాలను జారీ చేసింది. అధికారిక విధానం ప్రకారం, ఆటగాళ్ళు తమ కుటుంబాలను 14 రోజుల వరకు తమతో తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అయితే పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది.

2026 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఆటగాళ్ల అభ్యర్థనను తిరస్కరించిన బీసీసీఐ..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక ప్రకారం, ఆటగాళ్ల భార్యలు లేదా కాబోయే భార్యలు జట్టుతో ప్రయాణించి వారితో ఉండవచ్చా అనే దానిపై బీసీసీఐ నుంచి వివరణ కోరింది. ఈ క్రమంలో బీసీసీఐ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. కుటుంబ సభ్యులను ఆటగాళ్లతో ఉండటానికి అనుమతించబోమని పేర్కొంది.

టీమిండియా షెడ్యూల్..

ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై 29 పరుగుల తేడాతో భారత్ తమ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రచారాన్ని ప్రారంభించింది. మార్చి 8న భారత్ ఫైనల్‌కు చేరుకుంటే టీమిండియా ఆటగాళ్ల షెడ్యూల్ ఒక నెల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి బీసీసీఐ నిర్దేశించింది కేవలం 14 రోజులే. దీంతో ఆటగాళ్లు బీసీసీఐని అభ్యర్థించారు. కానీ ఇందుకు బోర్ట్ ఏమాత్రం ఒప్పుకోలేదు.

తొలి విజయం తర్వాత, జట్టు ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. ఇప్పుడు ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగే గ్రూప్-స్టేజ్ మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూప్ మ్యాచ్ కోసం భారతదేశానికి తిరిగి రానుంది.

మెన్ ఇన్ బ్లూ సూపర్ 8, నాకౌట్ దశలకు చేరుకుంటే, ఈ ప్రయాణం మరింత పెరగనుంది. ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టు అనేక ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా ఆడింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులను జట్టుతో ఉండటానికి అనుమతించలేదు.

టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు కఠినమైన వ్యవస్థలను ఏర్పాటు చేసింది. జట్టు ప్రైవేట్ చార్టర్ విమానాలను ఉపయోగించి ప్రయాణిస్తుంది. అయితే వ్యక్తిగత చెఫ్‌లు సమీపంలోని హోటళ్లలో భోజనం తయారు చేసి జట్టుకు పంపడానికి ఏర్పాటు చేసుకోవచ్చు.

కోవిడ్-19 కాలం తర్వాత, భారత ఆటగాళ్లు మొత్తం విదేశీ పర్యటనల కోసం వారి కుటుంబాలతో కలిసి ఉండటానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత పరిస్థితి మారిపోయింది. కొంతమంది ఆటగాళ్ళు తమ భాగస్వాములు లేదా పిల్లలతో ఉండటానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో అంతర్గత సమావేశాలు, ప్రణాళిక సెషన్‌లకు హాజరు కాలేదని సహాయక సిబ్బంది పేర్కొనడంతో.. బీసీసీఐ ఈ కఠిన నియమాలు ఏర్పాటు చేసింది. ఫలితంగా బీసీసీఐ జనవరి 2025లో తన విధానాలను సవరించింది. పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే కుటుంబాలు ఆటగాళ్లతో గరిష్టంగా 14 రోజులు ఉండడానికి వీలు కల్పించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..