IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పూర్తి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ లీగ్‌ను స్వదేశంలో నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోన్న బోర్డు.. దానికి తగ్గట్టుగా వేదికలను సైతం ప్రాధమికంగా ఖరారు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో.. క్వాలిఫైయర్స్, ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించాలని చూసింది. అలాగే టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకు ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్లాన్-బీను అమలు చేసేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది.
కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లను నిర్వహించాలని చర్చిస్తోంది. ఈమేరకు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ప్లే-ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అటు టోర్నమెంట్ షెడ్యూల్ కూడా నిన్న ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఎలక్షన్స్ ద్వారా మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఫైనల్ షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు షురూ చేసింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్ బాల్ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది. ఆ జట్టు నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్ 19 పరుగులతో సరిపెట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికట్లు, అశ్విన్ 4, సుందర్ ఒక వికెట్ తీశాడు.
కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!