
IPL 2025 New Schedule: ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే బీసీసీఐ ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌ల కోసం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐపీఎల్ 2025 (IPL 2025)లో ఫైనల్, క్వాలిఫైయర్, ఎలిమినేటర్‌తో సహా మిగిలిన 13 గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇప్పుడు మే 17 నుంచి జూన్ 3 వరకు జరగనున్నాయి. అయితే, కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తూనే, BCCI తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం భారతదేశంలోని 5 నగరాల్లో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను నిర్వహించకపోవడానికి సంబంధించినది. కొత్త షెడ్యూల్ ప్రకారం, భారతదేశంలోని 6 నగరాల్లో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలోని ఆ 5 నగరాల్లో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ఎందుకు నిషేధించారు? ఇందుకు సమాధానం ఏమిటంటే, ఈ ఐదు నగరాలు సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. కొత్త షెడ్యూల్‌లో, భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుకు దూరంగా ఉన్న 6 నగరాలను మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ 6 నగరాలు ఏ పొరుగు దేశ సరిహద్దుకు ఆనుకొని లేవన్నమాట.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, బీసీసీఐ ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను నిర్వహించకూడదని నిర్ణయించిన నగరాలు ఏవి? ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు గతంలో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, చెన్నై, ధర్మశాల, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్, విశాఖపట్నం, గౌహతిలలో జరిగేవి. ఈ 13 నగరాల్లో, ఇప్పుడు 6 వేదికలు మాత్రమే IPL 2025 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ 6 ప్రదేశాలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్.
మిగిలిన నగరాల్లో విశాఖపట్నం, గౌహతికి పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు జరగలేదు. ధర్మశాల పంజాబ్ కింగ్స్‌కు రెండవ స్థావరం. భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత కారణంగా ఆ మ్యాచ్ హడావిడిగా రద్దు చేశారు. ధర్మశాల భారతదేశ అంతర్జాతీయ సరిహద్దు నుంచి చాలా దగ్గరగా ఉంది. ఈ కారణంగా ఇక్కడ మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
ధర్మశాల తప్ప, చెన్నై, ముల్లన్పూర్, కోల్‌కతా, హైదరాబాద్‌లలో ఇకపై మ్యాచ్‌లు ఉండవు. చెన్నై, ముల్లన్పూర్, కోల్‌కతా భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నగరాలు. చెన్నై, హైదరాబాద్‌లలో మ్యాచ్ నిర్వహించకపోవడానికి మరొక కారణం ఐపీఎల్ 2025లో ఆ నగరాల జట్ల పేలవమైన ప్రదర్శన. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
అయితే, ధర్మశాల, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో వాతావారణ పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. రుతుపవనాలు త్వరగా రావడంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వారం వాయిదా పడడంతోపాటు మ్యాచ్‌లు కూడా వర్షంతో రద్దయితే బీసీసీఐ నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రాంతాల్లో మ్యాచ్‌లు నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..