WTC Final: ‘స్కై’ ఔట్-రహన్ ఇన్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ తుది జట్టు ఇదే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

|

Apr 25, 2023 | 12:18 PM

Team India for WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడునుంది. ఈ నేపథ్యంలోనే..

WTC Final: ‘స్కై’ ఔట్-రహన్ ఇన్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ తుది జట్టు ఇదే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
Team India Squad For Wtc Final Against Australia
Follow us on

Team India for WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడునుంది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూటీసీ ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితాను సెలక్షన్ కమిటీ ఈ రోజు ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అజింక్య రహానేకి తుదిజట్టులో చోటు దక్కింది. అలాగే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఆడేందుకు అవకాశం సంపాదించుకున్నాడు. మరోవైపు జస్ప్రీత్ బూమ్రా ఇంకా వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతనికి ఈ జట్టులో స్థానం లభించలేదు. ఫైనల్‌లో టీమిండియా బౌలింగ్ విభాగానికి బలం చేకూర్చేందుకు సెలెక్షన్ టీమ్.. మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌తో పాటు అదనపు సీమర్‌గా శార్దూల్ ఠాకూర్‌ని కూడా ఎంపిక చేసింది. అలాగే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బౌలింగ్‌ని ముందుండి నడిపించిన ముగ్గురు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌కి కూడా అవకాశం లభించింది.

ఇక బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో అవకాశం లభించలేదు. ఈ ఏడాది ఆరంభంలో టెస్టులో అరంగేట్రం చేసి కేవలం ఎనిమిది పరుగులే చేసిన సంగతి తెలిసిందే. అలాగే రోడ్ ప్రమాదం కారణంగా రిషబ్ పంత్ ఇప్పటికీ అందుబాటులో లేకపోవడంతో.. మరో హైదరాబాదీ కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులు ఆడిన భరత్ కేవలం 101 పరుగులే చేసినా అతనికి అవకాశం లభించింది. ఇక ఈ టీమ్‌లో టాప్ ఆర్డర్ ప్లేయర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

‘టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌’ కోసం టీమిండియా ఆటగాళ్లు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..