ఆ థియరీ జోలికి పోవద్దు.. మీ ఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ మాస్ వార్నింగ్..?

BCCI monitoring Vaibhav Sooryavanshi, Abhishek Sharma: యువ రక్తం జట్టులోకి రావడం శుభపరిణామమే అయినా, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకుని నిలబడాలంటే కేవలం సిక్సర్లపైనే ఆధారపడితే సరిపోదు. బీసీసీఐ హెచ్చరికల నేపథ్యంలో, ఈ ఇద్దరు యువ కిరణాలు తమ దూకుడుకు కాస్త సంయమనాన్ని జోడించి, రాబోయే మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయతీరాలకు చేరుస్తారని ఆశిద్దాం.

ఆ థియరీ జోలికి పోవద్దు.. మీ ఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ మాస్ వార్నింగ్..?
Vaibhav Sooryavanshi Abhishek Sharma

Updated on: Jul 11, 2026 | 9:18 AM

BCCI monitoring Vaibhav Sooryavanshi, Abhishek Sharma: భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీతో పాటు పవర్‌ఫుల్ ఓపెనర్ అభిషేక్ శర్మల మెరుపు హిట్టింగ్‌పై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస ఓటములతో కుంగిపోతున్న వేళ, ఈ ఇద్దరు యువ ఓపెనర్ల ఆటతీరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిఘా పెట్టినట్లు సమాచారం.

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తప్పని పరాజయాలు..

భారత టీ20 జట్టు సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది. ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ పగ్గాలు అందుకున్నాడు. అయితే, ఈ కొత్త ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే ఐర్లాండ్ చేతిలో ఊహించని విధంగా 2-0తో సిరీస్ కోల్పోయిన భారత్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ 3-0తో సిరీస్ కోల్పోయింది. అయ్యర్ కెప్టెన్సీలో కనీసం ఒక్క విజయం కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తోంది.

ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

ఇవి కూడా చదవండి

సిక్సర్ల జోరుకు బ్రేకులు పడాల్సిందేనా..?

ఈ పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు జట్టు ప్రదర్శనపై సమీక్షలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు క్రీజులోకి రాగానే బౌండరీల కోసం చూస్తూ వికెట్లు పారేసుకోవడంపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. “అభిషేక్, వైభవ్‌ల సిక్సర్లు కొట్టే సామర్థ్యం అద్భుతమైనదే, కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితికి తగ్గట్టుగా ఆ సామర్థ్యాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సచిన్ రికార్డు బద్దలు కొట్టినా.. నిలకడ లేని వైభవ్..

కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, 1989 నాటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ తిరగరాశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ వంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. కానీ, అంతర్జాతీయ వేదికపైకి వచ్చేసరికి ఈ యువ సంచలనం వరుసగా 14, 13, 15 పరుగులకే పరిమితమై అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ధనాధన్ షాట్లకే ప్రాధాన్యత ఇస్తూ క్రీజులో నిలదొక్కుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!

అభిషేక్ శర్మ పోరాటం సరిపోవడం లేదా..?

మరోవైపు, అభిషేక్ శర్మ వైభవ్ కంటే కొంత మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ, మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు 59, 43, 10, 16 పరుగులు చేసిన అభిషేక్, మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దూకుడుగా ఆడటం మంచిదే అయినా, ఇన్నింగ్స్ నిర్మించడంపై కూడా ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు దృష్టి పెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us