BCCI has removed soft signal: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో కీలక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో “సాఫ్ట్ సిగ్నల్” ఔట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఫీల్డ్అంపైర్ సాప్ట్ సిగ్నల్‌ను ఐపీఎల్- 2021 సీజన్‌కి రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది బీసీసీఐ. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అపెండిక్స్ డి-క్లాస్ 2.2.2.. ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
మ్యాచ్‌లో ఫీల్డర్ సందేహాస్పదంగా క్యాచ్ పట్టినప్పుడు.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌పై తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని కోరుతాడు. ఇలాంటి సమయంలో తనవైపు నుంచి సాప్ట్ సిగ్నల్‌గా ఔట్ / నాటౌట్‌ని అని ఫీల్డ్ అంపైర్ చెప్పేవాడు.
ఆ తర్వాత థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలించి.. స్పష్టమైన ఆధారాలు దొరకని సమయంలో.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడేవాడు. అయితే.. కొన్ని సందర్భాల్లో ఆధారాలు కనిపిస్తున్నా.. రిస్క్ తీసుకునేందుకు థర్డ్ అంపైర్ వెనుకంజ వేస్తున్నారు. దాంతో అంపైర్ నిర్ణయాలు వివాదాలుగా మారుతున్నాయి. ఐపీఎల్2021లో ఇలాంటి తప్పులు జరగకూడదనే సాప్ట్ సిగ్నల్ పద్ధతికి బీసీసీఐ ఎండ్ కార్డ్ వేసింది. ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో థర్డ్ అంపైర్ ఔట్ లేదా నాటౌట్ నిర్ణయాన్ని.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ప్రేమయం లేకుండా తీసుకోనున్నాడు.
టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ని ఫీల్డర్ డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ తీసుకున్నాడు. కానీ.. క్యాచ్ పట్టిన తర్వాత అతను పట్టిన బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రిప్లైలో చాలా క్లీయర్‌గా కనిపించింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ సాప్ట్ సిగ్నల్ ఔట్ ఇవ్వడం.. థర్డ్ అంపైర్ కూడా క్యాచ్‌పై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే ఓటు వేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇలా నిర్ణయాల విషయంలో ఎలా అనుసరించాలి అనే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.