Ranji Trophy 2022: రెడ్-బాల్ టోర్నమెంట్ భారత క్రికెట్‌కు వెన్నెముక లాంటింది. ఎందుకంటే ఇది అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెటర్లను ఉత్పత్తి చేసేందుక కీలకంగా తయారైంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత సీజన్‌లో రంజీ ట్రోఫీ నిర్వహించలేదు. ఈ సీజన్ తేదీలను ఇంకా బీసీసీఐ (BCCI) ప్రకటించలేదు. సాధారణంగా నవంబర్ చివరిలో ప్రారంభమయ్యే సీజన్ ఇప్పటికీ కొత్త తేదీ కోసం వెతుకుతోంది. అయితే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ 2022(IPL 2022)ని భారత్‌లో నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంజీ ట్రోఫీ(Ranji Trophy 2022) భవితవ్యంపై నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాతో సహా కీలక సభ్యులు గురువారం సమావేశమయ్యారు. సమావేశం ముగింపులో టోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 38 జట్ల టోర్నీ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమవుతుందని, మొదటి దశ దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.
బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్, గురువారం బోర్డు సమావేశం తర్వాత, టోర్నమెంట్‌ను రెండు దశల్లో నిర్వహించాలని సభ్యలు భావిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే మార్చి 27 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీంతో రంజీ ట్రోఫీని సాగదీయడం తప్పడం లేదని తెలుస్తోంది. అనేక రాష్ట్రాలు, బీసీసీఐతో ఒక సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ధుమాల్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు.
బీసీసీఐ ఉద్దేశాలపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ కోసం రంజీ ట్రోఫీని వాయిదా వేయడం తప్పంటూ విమర్శలు చేస్తున్నారు. వీరికి తోడు మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భారత మాజీ హెడ్ కోచ్ శాస్త్రి తన ట్విట్టర్‌లో స్పందించాడు. భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ ఎంతో ముఖ్యమని, ఈ సంవత్సరం దానిని నిర్వహించాలని BCCIని కోరాడు. రంజీ ట్రోఫీని భారత క్రికెట్‌కు వెన్నెముకని, రంజీ లేకుండా భారత క్రికెట్ లేదంటూ చెప్పుకొచ్చాడు.
“రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నెముక. మీరు దానిని విస్మరించడం ప్రారంభించిన క్షణం మా క్రికెట్ వెన్నుముక లేకుండా పోతుంది!” అని శాస్త్రి ట్వీట్ చేశాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా హాట్ టాపిక్‌పై ట్వీట్ చేశాడు. గత కొద్దిరోజులుగా టోర్నమెంట్ నిర్వహించాలా వద్దా అని అడుగుతున్న దేశీయ క్రికెటర్ల నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. IPL ఆడని ఆటగాళ్లు ఉన్నారని మర్చిపోవద్దు. వారి కెరీర్ రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్‌లపై ఆధారపడి ఉంటుందంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా, దేశంలో దేశవాళీ క్రికెట్ జరగడం లేదని అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్‌లు బాధపడుతున్నట్లు కూడా ట్వీట్‌లో పేర్కొన్నాడు.
The Ranji Trophy is the backbone of Indian cricket. The moment you start ignoring it our cricket will be SPINELESS!
— Ravi Shastri (@RaviShastriOfc) January 28, 2022
Bhai Ranji trophy kab start ho Rahi hai? Ho Rahi ha na? I had at least 25 cricketers calling and checking on me about it. So happy to hear about Ranji trophy starting soon. #happynews @BCCI
— Irfan Pathan (@IrfanPathan) January 28, 2022
29 ఫోర్లు, 7 సిక్సులు.. బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు.. ఇదేం బ్యాటింగ్ రా బాబోయ్ అంటోన్న నెటిజన్లు