AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBL 2021: బీబీఎల్‌పై కరోనా పంజా.. గ్లెన్ మాక్స్‌వెల్‌తో సహా 13 మందికి పాజిటివ్..!

Glenn Maxwell: గ్లెన్ మాక్స్‌వెల్ BBL (బిగ్ బాష్ లీగ్)లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

BBL 2021: బీబీఎల్‌పై కరోనా పంజా.. గ్లెన్ మాక్స్‌వెల్‌తో సహా 13 మందికి పాజిటివ్..!
Bbl 2021 Glenn Maxwell
Venkata Chari
|

Updated on: Jan 05, 2022 | 10:19 AM

Share

BBL 2021: ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా కేసులు భారీగానే వెలుగుచూస్తుండడంతో పలు రంగాలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే దేశీయంగా జరగాల్సిన అన్ని లీగ్‌లను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలసిందే. రంజీలో కరోనా కేసులు బయటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కరోనా బారిన పడ్డాడు. మాక్స్‌వెల్ ప్రస్తుతం BBL (బిగ్ బాష్ లీగ్) ఆడుతున్నాడు. అక్కడ అతను మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మేరకు మెల్‌బోర్న్ స్టార్స్ బృందం సమాచారం ఇచ్చింది. సోమవారం రాత్రి మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మాక్స్‌వెల్‌కు యాంటిజెన్ పరీక్ష చేసినట్లు పేర్కొంది. దీని నివేదిక సానుకూలంగా వచ్చింది. దీంతో మాక్స్‌వెల్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. RTPCR పరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నారు.

క్లబ్ తన ప్రకటనలో, ‘మాక్స్వెల్ యాంటిజెన్ పరీక్ష మంగళవారం జరిగింది. దీని ఫలితం సానుకూలంగా వచ్చింది. అలాగే RTPCR పరీక్ష నిర్వహించాం. ఫలితాల కోసం వేచిచూస్తున్నాం. మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు పంపాం. కరోనా సోకిన మెల్‌బోర్న్ స్టార్స్‌లో మ్యాక్స్‌వెల్ 13వ ఆటగాడు. జట్టులోని 8 మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది.

అంతకుముందు, బ్రిస్బేన్ హీట్ జట్టు ఆటగాళ్లు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కరోనా వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఈ కారణంగానే చివరి క్షణంలో బీబీఎల్ మూడు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చింది. బీబీఎల్ జట్లలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు క్రికెట్ ఆస్ట్రేలియాను ఆందోళనకు గురిచేస్తుంది.

కరోనా భయం కారణంగా, ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బిగ్ బాష్‌లో ఆడుతున్న ఆరుగురు ఆటగాళ్లను ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావాలని ఆదేశించింది. బీబీఎల్‌లో ఆడుతున్న ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు వెస్టిండీస్‌లో జాతీయ జట్టు పర్యటనకు ముందు క్వారంటైన్‌లో ఉండేందుకు త్వరగా స్వదేశానికి చేరుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

Also Read: Most Ducks In Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో డకౌట్ల రికార్డులు.. టాప్ 10 లిస్టులో ఇద్దరు భారతీయులు..!

IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!