Andrew tye: రెండు బంతులు అలా వేశాడు అంతే.. మిగతా ఓవర్లు వేయకుండా నిషేధం విధించారు..

|

Dec 28, 2021 | 5:40 PM

బిగ్ బాష్ లీగ్ 2021-22 24వ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని సంఘటన ఎదురైంది...

Andrew tye: రెండు బంతులు అలా వేశాడు అంతే.. మిగతా ఓవర్లు వేయకుండా నిషేధం విధించారు..
Tye
Follow us on

బిగ్ బాష్ లీగ్ 2021-22 24వ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని సంఘటన ఎదురైంది. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై కేవలం 9 బంతులు వేసిన తర్వాత అతన్ని బౌలింగ్ చేయకుండా అంపైర్లు అడ్డుకున్నారు.

ఆండ్రూ టై తన రెండో ఓవర్‌లో బ్యాట్స్‌మన్ నడుముపైకి రెండు బీమర్లను వేశాడు. ఈ రకమైన బంతి చాలా ప్రమాదకరమైనదిగా పరిగణినిస్తారు. నిబంధనల ప్రకారం ఎవరైనా బౌలర్ అలాంటి బంతిని రెండుసార్లు వేస్తే మ్యాచ్‌లో బౌలింగ్ చేసేందకు అతనికి అవకాశం ఉండదు. ఆండ్రూ టై కూడా అదే తప్పు చేశాడు. దీంతో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు.

ప్రపంచ టీ20 బౌలర్లలో ఒకరైన ఆండ్రూ టై అనేక వికెట్లు తీశాడు. కానీ సిడ్నీ థండర్‌పై, ఈ బౌలర్ తన బంతులను నియంత్రించులేకపోయాడు. 7వ ఓవర్‌లో టై బౌలింగ్ చేశాడు.11 పరుగులు ఇచ్చాడు. కానీ టై తన రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతను పెద్ద తప్పు చేసాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో పేరుగాంచిన టై 15వ ఓవర్‌లోని నాల్గో బంతిని అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్‌ వేశాడు. దీని తర్వాత, అతను తదుపరి బంతిని వైడ్‌గా వేశాడు. ఆ తర్వాత టై మరోసారి బీమర్‌ను విసిరాడు. ఈ బంతిని అలెక్స్ రాస్ ఫోర్ కొట్టాడు. నిబంధనల ప్రకారం అంపైర్లు టై బౌలింగ్‌ను అడ్డుకున్నారు.

టై ఈ మ్యాచ్‌లో 9 బంతులు మాత్రమే వేయగలిగాడు. అతను 17.30 ఎకానమీ రేటుతో 26 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‎లో సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగులకు చేరుకుంది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

Read Also..  Iceland Cricket: రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకలో పుడితే.. బ్రాడ్‌మాన్‌ ఐస్‌లాండ్‌లో జన్మిస్తే.. ఎలా ఉంటుదంటే..