No Ball: వామ్మో.. ఇదేం బౌలింగ్ బ్రో.. 65 వైడ్స్, 15 నో బాల్స్‌తో 92 పరుగులు.. అత్యంత చెత్త రికార్డు ఇదే.. ఆ బౌలర్ ఎవరంటే?

|

Jan 06, 2023 | 4:30 PM

Cricket News: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 నో బాల్స్ విసిరింది. ఆ తర్వాత నో బాల్‌పై చాలా చర్చ మొదలైంది. క్రికెట్ చరిత్రలో నో బాల్ విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టిన ఓ బౌలర్ కూడా ఉన్నాడని మీక తెలుసా?

No Ball: వామ్మో.. ఇదేం బౌలింగ్ బ్రో.. 65 వైడ్స్, 15 నో బాల్స్‌తో 92 పరుగులు.. అత్యంత చెత్త రికార్డు ఇదే.. ఆ బౌలర్ ఎవరంటే?
No Ball
Follow us on

పూణె వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ నుంచి వార్తల్లో ‘నో బాల్’ న్యూస్ ఎక్కువైంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 7 నో బాల్స్ వేయగా, అందులో 5 అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే విసిరాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 3 నో బాల్‌లు వేసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. అయితే, ఒకే ఓవర్‌లో అదనపు బంతుల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా బంగ్లాదేశ్ బౌలర్ రికార్డు సృష్టించాడు. ఢాకా సెకండ్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ 4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చాడు.

షియోమ్ వర్సెస్ లాల్మతియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ 65 వైడ్ బాల్స్, 15 నో బాల్స్ వేశాడు. అయితే, ఆ తర్వాత ఈ విషయంపై విచారణ జరిగింది. బ్యాట్స్‌మన్ 4 సరైన బంతుల్లో 12 పరుగులు చేశాడు.

అంపైర్‌పై వ్యతిరేకతతోనే..

లాల్మాటియా బౌలర్ సుజోన్ మహమూద్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు. అతను అంపైర్ తప్పిదాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బర్ట్ పేరిట ఉంది. అతను వెల్లింగ్టన్ తరపున ఆడుతున్నప్పుడు కాంటర్బరీపై 22 బంతుల్లో 77 పరుగులు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

షమీ పేరుపైనా చెత్త రికార్డు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించిన మహ్మద్ సమీ పేరు మీద ఉంది. ఒకే ఓవర్‌లో 7 వైడ్‌లు, 4 నో బాల్స్‌తో 17 బంతులు వేశాడు. బంగ్లాదేశ్‌పై ఒకే ఓవర్‌లో 22 పరుగులు ఇచ్చాడు.

భువనేశ్వర్ పేరిట స్పెషల్ రికార్డు..

అర్ష్‌దీప్ సింగ్ పేరు మీద ఇబ్బందికరమైన రికార్డు నమోదైంది. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్క నోబాల్ కూడా వేయని భారతీయ క్రికెటర్ కూడా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు టీ20లో 298.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను ఒక్కసారి కూడా లైన్ దాటలేదు.

భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి మాట్లాడితే.. భారత్‌ పేలవమైన బౌలింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నో బాల్ విషయంలో అర్ష్‌దీప్ ఇబ్బందికర రికార్డు సృష్టించాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. శివమ్ మావి కూడా 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఈ టార్గెట్‌ను ఛేదించలేక టీమిండియా ఓటమిపాలైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..