బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ వికెండ్‌లో మోమినుల్ హక్ చరిత్ర సృష్టించాడు. చరిత్రలో పది టెస్ట్ సెంచరీలు చేసిన మొదటి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇందులో బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ (115) సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ మంచి స్కోరు చేసింది.
Congratulations to Mominul Haque for his 10th Test century which is now the highest among the Bangladeshi batsmen.#BANvWI #RiseOfTheTigers pic.twitter.com/RNtONU8bl7
— Bangladesh Cricket (@BCBtigers) February 6, 2021
కెప్టెన్‌తో పాటు లిటన్ దాస్ (69) రాణించడంతో బంగ్లా 223/8 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విండీస్ బౌలర్లలో రాకీమ్ కార్న్‌వాల్, వారికన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 395 పరుగుల భారీ టార్గెట్‌తో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 110/3తో నిలిచింది.
చేతిలో ఏడు వికెట్లు ఉన్న కరీబియన్లు విజయానికి 285 పరుగులు చేయాల్సి ఉంది. బూనర్ (15), మయేర్స్ (37) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌కు మూడు వికెట్లు దక్కాయి.
బంగ్లాదేశ్ సినియర్ ఆటగాల్లు అతని ఆటతీరు ప్రశంసించారు. “అతను మాకు ఆటను బాగా సెట్ చేసాడు, కాబట్టి అతను ప్రస్తుతం ఆడుతున్న తీరు పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము” అని కోచ్ రస్సెల్ డొమింగో అన్నాడు.
ఇక బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్‌లో రికార్డుల పరంపరను బ్రేక్ చేశాడు. ఇక్బాల్, షకీబ్ అల్ హసన్‌తోపాటు ముష్ఫికర్ రహీమ్ పేరుతో ఉన్న రికార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దేశంలో ప్రముఖ రన్-స్కోరర్‌గా నిలిచాడు. 2013లో శ్రీలంకలోని గాలెలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మోమినుల్ హక్ 29 పరుగులతో కెరీర్‌ను మొదలు పెట్టాడు.
ఇవి కూడా చదవండి :
India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్ 59/2
Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!