WWE ఫైట్‌లా మారిన ‘బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్‌’.. దెబ్బకి టోర్నీ రద్దు.. అసలేం జరిగిందంటే..?

Bangladesh Celebrity Cricket League: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నో సందర్భాల్లో ప్లేయర్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఇలా జరిగినప్పుడు అంపైర్లు ఇరు జట్లకు, వివాదంలో ఉన్న ప్లేయర్లకు ఫైన్ విధిస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరిగిన రచ్చకి ఏకంగా టోర్నమెంట్‌నే రద్దు చేశారు అంపైర్లు. అవును, బంగ్లాదేశ్‌లోని ఫిల్మ్ స్టార్స్ అంతా కలిసి ఆడుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టోర్నీ..

WWE ఫైట్‌లా మారిన ‘బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్‌’.. దెబ్బకి టోర్నీ రద్దు.. అసలేం జరిగిందంటే..?
Bangladesh Celebrity Cricket League

Updated on: Sep 30, 2023 | 8:11 PM

Bangladesh Celebrity Cricket League: క్రికెట్ అయినా, కబడ్డీ అయినా ప్రత్యర్థుల నుంచి అప్పుడప్పుడు పరస్పర మాటల తూటాలు, దూషణలు వినిపించడం సర్వసాధారణం. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నో సందర్భాల్లో జరిగాయి. ఇలా జరిగినప్పుడు అంపైర్లు ఇరు జట్లకు, వివాదంలో ఉన్న ప్లేయర్లకు ఫైన్ విధిస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరిగిన రచ్చకి ఏకంగా టోర్నమెంట్‌నే రద్దు చేశారు అంపైర్లు. అవును, బంగ్లాదేశ్‌లోని ఫిల్మ్ స్టార్స్ అంతా కలిసి ఆడుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టోర్నీ రద్దయింది.

ఢాకా వేదికగా శుక్రవారం రాత్రి ఫిల్మ్ మేకర్స్ ముస్తాఫ కమల్ రాజ్, దిపంకర్ దీపన్ నేతృత్వంలోని జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట జరుగుతున్న సమయంలో అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయంపై ఇరు జట్లలోని సెలెబ్రిటీలు/ప్లేయర్లు పరస్పరం నెట్టుకున్నారు. ఈ గొడవలో మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆ మ్యాచ్‌నే కాక పూర్తి టోర్నమెంట్‌ని కూడా రద్దు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌కి చెందిన ప్రొడ్యూసర్ ముస్తాఫ కమల్ రాజ్‌, యాక్టర్ షరిఫుల్ రాజ్‌పై నటి రాజ్ రిపా తీవ్ర ఆరోపణలు చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాజ్ రిపా.. తన కెరీర్‌కి ఏమైనా జరిగితే వారిద్దరిదే బాధ్యత అని, వారు తన టీమ్‌పై వాటర్ బాటిల్స్ విసిరారని పేర్కొంది.

కాగా, బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టులో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇందుకు పలువురు నెటిజన్లు బంగ్లాదేశ్‌లో క్రికెట్ అంటే యుద్ధమే అంటూ మీమ్స్ కూడా షేర్ చేస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరిగిన ఇలాంటి ఫైట్ మాత్రం ఎక్కడా జరగలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.