టీ20 వరల్డ్ కప్‌లో గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తల్లి వెంటిలేటర్‌పై ఉంది. ఈ విషయాన్ని అతడి తండ్రి ఆజం సిద్ధిఖీ తెలిపాడు. బాబర్ తల్లికి శస్త్రచికిత్స తర్వాత వెంటిలేటర్‌పై ఉంచారని.. అదే బాధలో బాబర్ ఇండియాతో మ్యాచ్ ఆడాడని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 68 పరుగులతో అజేయంగా నిలిచాడని సిద్ధిఖీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ “తీవ్రమైన బాధలో” మూడు ప్రపంచ కప్ జరిగిన మూడు మ్యాచ్‌లో ఆడాడని చెప్పాడు.
“నా జాతి కొంత నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినందుకు మీ అందరికీ అభినందనలు. మా ఇంట్లో పెద్ద పరీక్ష జరిగింది. భారత్‌తో మ్యాచ్ జరిగిన రోజున బాబర్ తల్లి వెంటిలేటర్” పై ఉందని ఆజం సిద్ధిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. “బాబర్ మూడు మ్యాచ్‌లు చాలా బాధతో ఆడాడు. నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు. అలా అనుకున్నాను, కానీ బాబర్ బలహీనపడకూడదని నేను వచ్చాను” అని సిద్ధఖి కుటుంబ దిగిన ఫొటో పోస్ట్ చేశాడు.
తమ ఓపెనర్లు భారత్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేయడంతో సహా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచిన పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించే స్థానంలో ఉంది. ” ఎటువంటి కారణం లేకుండా మన జాతీయ హీరోలను విమర్శించకూడదని. పాకిస్తాన్ లాంగ్ లివ్” అని సిద్ధిఖీ అన్నారు. టీ20 ప్రపంచ కప్‌లో బాబర్ బాగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ మంగళవారం నమీబియాతో ఆడనుంది.
Read Also.. Ind Vs nz: జట్టులో మార్పు ఉంటుందా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..?