అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు, రాసలీలలు.. బాబర్‌లాగే అభాసుపాలైన స్టార్‌ క్రికెటర్లు వీరే.. లిస్టులో టీమిండియా క్రికెటర్ కూడా

| Edited By: Ravi Kiran

Jan 20, 2023 | 8:37 AM

బాబర్‌ ఇలా వివాదాల్లో కూరుకుపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. రెండేళ్ల కిందట పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెక్స్‌ ఛాట్‌, లైంగిక సందేశాలు మరోసారి బాబర్‌ మెడకు చుట్టుకున్నాయి.

అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు, రాసలీలలు.. బాబర్‌లాగే అభాసుపాలైన స్టార్‌ క్రికెటర్లు వీరే.. లిస్టులో టీమిండియా క్రికెటర్ కూడా
Cricketers
Follow us on

పాకిస్తాన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అసభ్యకర సందేశాలు, న్యూడ్‌ వీడియో కాల్స్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలే వరుస ఓటములతో అతని కెప్టెన్సీకి గండం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సహచర క్రికెటర్‌ ప్రియురాలితో బాబర్‌ సెక్స్‌ ఛాటింగ్‌ , లైంగిక సందేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘నువ్వు ఇలాగే నాతో సెక్స్ చాటింగ్ చేస్తుంటే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటకు వెళ్లడు’ అని ఒక అమ్మాయికి బాబర్ హామీ ఇవ్వడం ఈ వీడియోలో ఉంది. దీంతో బాబర్ ఆజామ్ హనీ ట్రాప్‌లో పడ్డాడని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. మరోవైపు బాబర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు బాబర్‌పై కొందరు కుట్ర చేస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే బాబర్‌ ఇలా వివాదాల్లో కూరుకుపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. రెండేళ్ల కిందట పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెక్స్‌ ఛాట్‌, లైంగిక సందేశాలు మరోసారి బాబర్‌ మెడకు చుట్టుకున్నాయి. ఇదిలా ఉంటే గతంలో కూడా కొందరు స్టార్‌ క్రికెటర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫలితంగా జట్టులో చోటు కూడా కోల్పోయారు.  వారెవరంటే?

టిమ్‌ పైన్‌..

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ ఇలాగే ఓ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్రికెట్ టాస్మానియాకు సంబంధించిన మాజీ ఉద్యోగిణికి టిమ్ తన ప్రైవేట్ పార్ట్స్‌ ఫొటోలు, అభ్యంతరకర మెసేజ్‌లు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2017లో ఈ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ టాస్మానియా సంయుక్త విచారణ జరిపి.. పైన్‌ పొరపాటు లేదని తేల్చింది. అయితే ఈ ఘటన బయట పడిన తర్వాత ఆసీస్‌ కెప్టెన్సీ నుంచి టిమ్‌ను తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. దీంతో చివరకు తనే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. కాగా తన ఆటో బయోగ్రఫీ ‘టిమ్ పైన్: ది ప్రైస్ పెయిడ్’లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుపై విరుచుకుపడ్డాడు. సెక్స్‌ ఛాటింగ్ కాంట్రవర్సీ తర్వాత క్రికెట్ బోర్డు తనను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మహ్మద్‌ షమీ..

2018 మార్చిలో టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహమ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. అతనికి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తనను బాగా హింసించాడంటూ ఆరోపించింది. షమీ చాటింగ్ చేసిన కొన్ని ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అలాగే ఒక పాకిస్థానీ మహిళ నుంచి షమీకి అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు అందినట్లు తెలిపింది. దీంతో కోల్‌కతా పోలీస్ స్టేషన్‌లో షమీ, మరో నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసు కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఆరోపణలను షమీ తీవ్రంగా ఖండించాడు. ఆతర్వాత బీసీసీఐ కూడా షమీ వ్యవహారంపై విచారణ చేసి అతనికి క్లీన్‌చీట్‌ ఇచ్చింది.

షేన్‌ వార్న్‌..

దివంగత షేన్ వార్న్ మైదానంలో ఆటగాడిగా ఆకట్టుకున్నా రీల్‌ లైఫ్‌లో మాత్రం నిత్యం వివాదాస్పదమయ్యాడు. 2000లో ఒక బ్రిటీష్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని అసభ్యకరమైన కాల్స్, వాయిస్ మెసేజ్‌లు కూడా బయటకు వచ్చాయి. ఆతర్వాత 2006లో ఒక రూంలో బ్రిటీష్ మోడల్‌లతో ఉన్న నగ్న చిత్రాలు సంచలనంగా మారాయి. పలువురు పోర్న్‌స్టార్స్‌తో వార్న్‌కు సంబంధాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే బ్రిటిష్ నటి లిజ్ హర్లీ వార్న్‌తో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది.

కెవిన్‌ పీటర్సన్‌

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడైన కెవిన్ పీటర్సన్ కూడా ఇలాంటి అసభ్యకర సందేశాలతో అభాసుపాలయ్యాడు. మోడల్ వెనెస్సా నిమ్మోతో కెవిన్ డేటింగ్ చేశాడు. పెళ్లి కూడా చేసుకోవాలనకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వెనెస్సా తమ రిలేషన్‌ షిప్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఆతర్వాత ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో భాగంగాదక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఆండ్రూ స్ట్రాస్, ఆండీ ఫ్లవర్ గురించి అవమానకరమైన సందేశాలు పంపించడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై వేటు వేసింది.

క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్రిస్ గేల్ ఆటతోనే కాదు ఇలాంటి వివాదాలతోనూ పలుమార్లు వార్తల్లో నిలిచాడు. 2012 టీ20 ప్రపంచకప్‌ సమయంలో అతని హోటల్‌ రూంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు బ్రిటిష్‌ మహిళలను శ్రీలంక పోటీసులు అరెస్ట్‌ చేశాడు. ఇక 2016లో బిగ్‌బాస్‌ లీగ్‌ టోర్నీ సందర్భంగా ఓ మహిళా రిపోర్టర్‌తో అసభ్యకరంగా మాట్లాడాడు. ‘నీ కళ్లు మొదటిసారి చూడటానికే ఇక్కడ ఉన్నాను. చాలా బాగున్నాయి. ఈ మ్యాచ్‌ గెలిచిన తర్వాత, మనం మళ్లీ కలుద్దాం. డోంట్‌ బ్లష్‌ బేబీ’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తర్వాత గేల్ క్షమాపణలు చెప్పాడు. ఇది ఒక సాధారణ జోక్ అని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..