KKR Vs LSG: రాణించిన లక్నో బౌలర్లు.. కోల్‌కత్తాపై ఘన విజయం.. కేకేఆర్‌ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..!

|

May 08, 2022 | 12:06 AM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR), లక్నో సూపర్‌ జెయింట్స్(LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

KKR Vs LSG: రాణించిన లక్నో బౌలర్లు.. కోల్‌కత్తాపై ఘన విజయం.. కేకేఆర్‌ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..!
Lsg
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR), లక్నో సూపర్‌ జెయింట్స్(LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 101 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో హార్డ్‌హిట్టర్‌ ఆండ్రూ రస్సెల్‌ 45, సునిల్ నరైన్‌ 22, ఆరోన్‌ ఫించ్‌ 14 మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, జాసన్ హోల్డర్ 3.. మోహ్‌సిన్‌ ఖాన్‌, చమీర, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతోపాటు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిశాయి.

అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ 50 పరుగులు చేయగా.. దీపక్‌ హుడా 41, కృనాల్ పాండ్య 25, మార్కస్ స్టొయినిస్ 28, అయుష్‌ బదోని 15, జాసన్ హోల్డర్ 13 పరుగులతో రాణించారు. కోల్‌కత్తా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2.. టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, సునిల్ నరైన్ తలో వికెట్ తీశారు. శివమ్‌ మావి వేసిన ఓవర్‌లో లక్నో బ్యాటర్లు ఐదు సిక్సర్లు బాదారు. ఇందులో మూడు స్టొయినిస్‌ కొట్టగా.. మరో రెండు హోల్డర్‌ కొట్టాడు.

Read Also.. IPL 2022: మలింగ రికార్డును సమం చేసిన చాహల్.. బుమ్రా-భువనేశ్వర్‌లకే సాధ్యం కాలే.. అదేంటంటే?