IND VS AUS Test Match : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. రోహిత్ శర్మ 65 బంతుల్లో (24 ), శుభ్‌మన్‌గిల్ 68 బంతుల్లో (27) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో 22 ఓవర్లకు భారత్ స్కోర్ 52/0గా నమోదైంది.
అంతకుముందు స్టీవ్‌స్మిత్(131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఆసీస్ రెండో రోజు ఇన్నింగ్స్ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడించి మరో 8 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్ తీశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
IND VS AUS Test Match: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్.. టీ విరామానికి స్కోర్..