
Unbreakable Cricket Record: క్రికెట్ ఆట ఎంతో గమ్మత్తైనది. ఎన్నో రికార్డుల సాధించిన దిగ్గజాలు కూడా ఒక్కోసారి బాధపడాల్సి వస్తుంది. తన కెరీర్‌లో ఎన్నో డబుల్ సెంచరీలు సాధించిన రికార్డ్ హోల్డర్ విషయంలోనూ అచ్చం ఇలాంటిదే జరిగింది. అయితే, వీడ్కోలు మ్యాచ్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించే సమయం వచ్చింది. కానీ, ఖాతా కూడా తెరవకుండానే ఔట్ అవ్వడం దారుణంగా మారింది. క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకున్నా డకౌట్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..
మనం క్రికెట్ డాన్ అని పిలిచే సర్ డాన్ బ్రాడ్‌మాన్ గురించి ఇప్పుడు చెప్పబోయేది. అతని పేరుపై ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతను తన కెరీర్‌లో 12 డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు, ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. దీనిని సమం కూడా చేయలేకపోయాడు. ఇవన్నీ సాధించినప్పటికీ, అతను తన వీడ్కోలు మ్యాచ్‌లో బాధాకరమైన డకౌట్‌కు గురయ్యాడు.
టెస్ట్ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మాన్ ఎంతో అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 99.94 సగటుతో చరిత్రలో నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్ ఈ దిగ్గజమ. అయితే, ఈ సగటు 100 అయ్యేది. కానీ విధి మరోలా తలచింది. 1948 ఆగస్టు 14న, డాన్ బ్రాడ్‌మాన్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. అక్కడ అతనికి సగటున 100 పరుగులు చేరుకోవడానికి కేవలం 4 పరుగులు మాత్రమే అవసరం.
డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లాండ్‌తో తన చివరి సిరీస్ ఆడుతున్నాడు. అతను 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఇక చివరి మ్యాచ్‌లో అతను 100 సగటుకు కేవలం 4 పరుగుల దూరంలో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రాడ్‌మాన్ ఖాతా చివరి మ్యాచ్‌లో తెరవలేదు. దీంతో ఒక అద్భుతాన్ని కోల్పోయాడు. అయితే, అతని సగటు 99.94 కూడా ఒక అద్భుతం కంటే తక్కువేం కాదండోయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..