Video: ఔట్ ఇచ్చినా వెళ్ళిపోను.. అలా అని నేను చీటర్ కాదు: స్నికో వివాదంపై అలెక్స్ కేరీ సంచలన వ్యాఖ్యలు

Alex Carey Breaks Silence After Snicko Controversy: ఈ లైఫ్ దొరికిన తర్వాత కేరీ అద్భుతంగా ఆడి తన మూడో టెస్టు సెంచరీని (106 పరుగులు) పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 326/8 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ మాత్రం ఈ సాంకేతిక లోపంపై అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఉంది.

Video: ఔట్ ఇచ్చినా వెళ్ళిపోను.. అలా అని నేను చీటర్ కాదు: స్నికో వివాదంపై అలెక్స్ కేరీ సంచలన వ్యాఖ్యలు
Alex Carey Video

Updated on: Dec 18, 2025 | 8:02 AM

Alex Carey Breaks Silence After Snicko Controversy: యాషెస్‌ 2025-26 సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టెక్నాలజీ వైఫల్యం పెను దుమారాన్ని రేపింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ అవుటైనప్పటికీ, ‘స్నికోమీటర్’ (Snickometer) లోపంతో నాటౌట్‌గా తేలడం, ఆ తర్వాత అతను సెంచరీ బాదడం ఇంగ్లాండ్ శిబిరంలో ఆగ్రహానికి కారణమైంది. ఈ వివాదంపై అలెక్స్ కేరీ ఎట్టకేలకు మౌనం వీడారు.

ఏం జరిగింది? (Snicko Controversy)..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ కేరీ 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు, ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ వేసిన బంతి బ్యాట్‌ను తాకుతూ వెనక్కి వెళ్ళింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ ఆన్-ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెంటనే రివ్యూ (DRS) కోరారు.

అయితే, రిప్లేలో బంతి బ్యాట్‌ను దాటకముందే స్నికోమీటర్‌లో భారీ ‘స్పైక్’ (శబ్దం) కనిపించింది. బంతి బ్యాట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి శబ్దం రాలేదు. దీంతో టీవీ అంపైర్ క్రిస్ గఫానీ.. ఆ శబ్దం మరేదైనా కావచ్చునని భావించి, ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే మొగ్గు చూపారు.

తప్పు ఒప్పుకున్న టెక్నాలజీ సంస్థ..

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్నికోమీటర్ టెక్నాలజీని అందించే BBG స్పోర్ట్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆపరేటర్ పొరపాటు వల్ల బ్యాటర్ వైపు ఉన్న మైక్రోఫోన్‌కు బదులు బౌలర్ వైపు ఉన్న స్టంప్ మైక్ ఆడియోను ఉపయోగించారని, అందుకే శబ్దానికి, విజువల్స్‌కు పొంతన లేకుండా పోయిందని వారు స్పష్టం చేశారు.

అలెక్స్ కేరీ ఏమన్నారంటే?

మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేరీ నిజాయితీగా స్పందించారు. “బంతి బ్యాట్‌ను దాటేటప్పుడు ఏదో చిన్న శబ్దం వచ్చినట్లు నాకు అనిపించింది. రిప్లేలో కూడా అది వింతగా కనిపించింది. ఒకవేళ అంపైర్ నన్ను అవుట్ అని ఇస్తే నేను రివ్యూ తీసుకునేవాడిని కానీ.. పూర్తి నమ్మకంతో మాత్రం కాదు” అని తెలిపారు.

క్రికెట్‌లో అదృష్టం కూడా ఉండాలని, ఈ రోజు అది తన వైపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ అభిమానులు తనను ‘చీటర్’ అని పిలవడంపై స్పందిస్తూ.. తాను ‘వాకర్’ (అవుట్ అని తెలిస్తే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా వెళ్ళిపోయేవాడు) కాదని నవ్వుతూ బదులిచ్చారు.

మ్యాచ్ పరిస్థితి..

ఈ లైఫ్ దొరికిన తర్వాత కేరీ అద్భుతంగా ఆడి తన మూడో టెస్టు సెంచరీని (106 పరుగులు) పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 326/8 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ మాత్రం ఈ సాంకేతిక లోపంపై అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఉంది.