IND Vs AUS: బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్.. రెచ్చగొట్టే రాతలు రాస్తూ…

|

Dec 29, 2024 | 8:50 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవలే కోహ్లీని జోకర్ అంటూ వెక్కిరించిన ఆసీస్ మీడియా ఇప్పుడు రోహిత్ ను కెప్టెన్ క్రై బేబీ అని పిలుస్తోంది.

IND Vs AUS: బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్.. రెచ్చగొట్టే రాతలు రాస్తూ...
Australia Media Targeted Rohit and virat kohli
Follow us on

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో.. ఒకవైపు మైదానం లోపల ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య రోజుకో మాటల యుద్ధం జరుగుతుండగా.. మైదానం వెలుపల మాత్రం ఆస్ట్రేలియన్ మీడియా మాత్రం టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఆసీస్ మీడియా విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ విరాట్ కోసం జోకర్ అనే పదాన్ని కూడా ఉపయోగించింది. అతని దివంగత తండ్రిని కూడా ఎగతాళి చేసింది. కాగా, ఆస్ట్రేలియా మీడియా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ రోహిత్ ఫోటోను ట్యాంపరింగ్ చేస్తూ దురుసుగా ప్రవర్తించింది.

నిజానికి ఆస్ట్రేలియన్ టూర్ ప్రారంభం కాకముందే విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఆస్ట్రేలియాలోని ప్రతి వార్తాపత్రికలు కోహ్లీని కొనియాడుతున్నాయి. అయితే బాక్సింగ్ డే టెస్టులో సామ్ కాన్స్టాస్, విరాట్ మధ్య జరిగిన గొడవ తర్వాత ఆసీస్ మీడియా కోహ్లిని నిరంతరం దుర్భాషలాడడం ప్రారంభించింది. ఇప్పుడు ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుని, అతని ఫోటోను ట్యాంపర్ చేసి, కెప్టెన్ క్రై బేబీ అని క్యాప్షన్ ఇచ్చింది.

ఇంతకు ముందు కోహ్లిని టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా మీడియాకి సంబంధించిన  ఫోటొలు నెటింట్లో మంటలు పుట్టించాయి. ఇటీవల ఒక వార్తాపత్రిక తన స్పోర్ట్స్ పేజీలో సామ్ కాన్స్టాస్ ఫోటోను ప్రచురించింది. గతంలో ఓ వార్తాపత్రిక విరాట్ కోహ్లీని జోకర్‌గా చూపించింది. ఈ ఘటన తర్వాత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు రోహిత్ ను  ఆసీస్ మీడియా టార్గెట్ చేస్తుంది. మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఇప్పటికి 4 రోజుల ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. దీంతో 333 పరుగుల ఆధిక్యం లభించింది. అంటే ఈ మ్యాచ్‌లో చివరి రోజు అత్యంత ఉత్కంఠభరితంగా సాగనున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి