
India vs Australia: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ భారత్ తో జరిగే సిరీస్‌కు దూరం కానున్నాడు. తుంటి నొప్పితో బాధపడుతున్న కమ్మిన్స్‌కు వైద్యులు అదనపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు కమ్మిన్స్ దూరమయ్యాడు.

భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా అతను అందుబాటులో ఉండడు. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. కమిన్స్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో మిచెల్ మార్ష్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

నవంబర్ నాటికి పూర్తిగా కోలుకుంటేనే పాట్ కమిన్స్ యాషెస్ సిరీస్‌లో ఆడగలడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ నవంబర్ 21న ప్రారంభమవుతుంది.

ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు ముఖ్యమైనది, క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమ్మిన్స్ గాయాన్ని పర్యవేక్షించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిసింది. అందువల్ల కమ్మిన్స్ రాబోయే రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండటం ఖాయం.

న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు ఆస్ట్రేలియా టీ20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.