Cricket News: ప్రతి బౌలర్ కెరీర్‌లో ఒక్కసారైనా హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటాడు. కానీ అది అందరికి నెరవేరదు. అయితే ఒక బౌలర్ తను ఆడిన మూడో మ్యాచ్‌లోనే ఈ కల నెరవేర్చుకున్నాడు. కానీ ఆ హ్యాట్రికే అతడి కెరీర్‌కి ముగింపు పలికింది. తను ఆడిన చివరి మ్యాచ్‌గా మిగిలింది. అతడు ఆస్ట్రేలియా బౌలర్ ఆంథోనీ స్టువర్ట్. 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య కంగారూలు 3 వికెట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఈ మ్యాచ్ హీరో జీరో కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే వాస్తవానికి ఆంథోనీ తప్పు ఇందులో ఏమిలేదు. కానీ కెరీర్ మాత్రం ముగిసింది. పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ ఆ ఆస్ట్రేలియన్ బౌలర్‌కి ఎలా శిక్షగా మారిందో తెలుసుకుందాం.
పాకిస్థాన్‌పై హ్యాట్రిక్‌తో పాటు 5 వికెట్లు తీశాడు
నిజానికి ఆ మ్యాచ్‌లో ఆంథోనీ హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5గురు పాకిస్తాన్ ఆటగాళ్లని ఔట్ చేశాడు. అంటే మొత్తం మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున ఆంథోనీ స్టువర్ట్ 26 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు ఇందులో అద్భుతమైన హ్యాట్రిక్ నమోదైంది. ఆంథోనీ హ్యాట్రిక్‌లో ఎజాజ్ అహ్మద్, వసీం అక్రమ్, మొయిన్ ఖాన్‌ల వికెట్లు ఉన్నాయి.
అదే శిక్షగా మారింది..
సాధారణంగా హ్యాట్రిక్ తర్వాత ఎవరి కెరీర్ అయినా ఊపందుకుంటుంది. కానీ అది జరగలేదు. అతడి కెరీర్ ముగించారు. అతడు హ్యాట్రిక్ సాధించడమే పెద్ద నేరంగా భావించినట్లయింది. ఎందుకంటే అతడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆ ప్రదర్శన తర్వాత ఆంథోనీ స్టువర్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి ఎంపిక చేయలేదు. సెలక్టర్లు ఏం విన్నారో, ఏం చూశారో తెలియదు కానీ అతడిని మళ్లీ జట్టులోకి ఎంపిక చేయలేదు.
కేవలం 3 మ్యాచ్‌లు కెరీర్ క్లోజ్
ఫలితంగా అతడు హ్యాట్రిక్ సాధించిన మ్యాచ్ చివరిదైంది. ఇలా జరుగుతుందని బహుశా అతడు కూడా ఊహించలేదు కాబోలు. ఈ 3 మ్యాచ్‌లలో అతను 13.62 సగటుతో 8 వికెట్లు తీసుకున్నాడు అందులో అతను తన చివరి మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించాడు. అతనికి మళ్లీ ఆస్ట్రేలియా జట్టులో స్థానం లభించలేదు.