
Steve Smith-Usman Khawaja: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.
అడిలైడ్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా ఒక రోజు ముందే తమ తుది జట్టును (Playing XI) ప్రకటించింది. ఇందులో స్టీవ్ స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, మ్యాచ్‌కు కొద్ది సమయం ముందు స్మిత్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అతను ఈ మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
మొదట ప్రకటించిన జట్టులో ఉస్మాన్ ఖవాజాకు చోటు దక్కలేదు. యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టులో కూడా అతన్ని పక్కన పెట్టారు. కానీ స్మిత్ అనూహ్యంగా వైదొలగడంతో, టీమ్ మేనేజ్‌మెంట్ ఖవాజాను అత్యవసరంగా జట్టులోకి తీసుకుంది.
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడు కావడంతో, అతని లేని లోటు జట్టుపై ప్రభావం చూపవచ్చు. అయితే, అనుభవజ్ఞుడైన ఖవాజా రాకతో జట్టు కూర్పులో సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.
2023 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఆడుతోంది. ఈ సమయంలో స్టీవ్ స్మిత్‌ను శాండ్ పేపర్ వివాదంపై ఫ్యాన్స్ హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ వైపు చూస్తూ వారించాడు. అలా చేయవద్దంటూ అండగా నిలిచాడు.
ఈ ఆకస్మిక మార్పుతో ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..