
Australia vs England, 4th Match, Group B: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో నాల్గవ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. గ్రూప్ బిలో భాగంగా జరుగుతోన్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 352 పరుగుల టార్గెట్ నిలిచింది.
కాగా, ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లీష్ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతంలో అత్యధిక స్కోరు 2004లో అమెరికాపై న్యూజిలాండ్ చేసిన 347 పరుగులే, ఇప్పటి వరకు అత్యధికంగా నిలిచింది. ఈ స్కోర్‌ను ఇంగ్లండ్ జట్టు బ్రేక్ చేసింది. మరి ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.
165 పరుగులు చేసిన తర్వాత డకెట్ అవుట్ అయ్యాడు. అతను మార్నస్ లాబుస్చాగ్నే చేతిలో ఎల్బీడబ్యూగా పెవలియన్ చేరాడు. ఈ క్రమంలో బెన్ డకెట్ తన మూడవ వన్డే సెంచరీని సాధించాడు. మిగతా ఇంగ్లండ్ ప్లేయర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (14 పరుగులు), జామీ స్మిత్ (15 పరుగులు), ఫిల్ సాల్ట్ (10 పరుగులు), జోస్ బట్లర్ (23 పరుగులు), హ్యారీ బ్రూక్ (3 పరుగులు) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక సీనియర్ ప్లేయర్ జో రూట్ 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
A record-breaking knock from Ben Duckett set the tone for England’s mammoth total against Australia 🔥#ChampionsTrophy #AUSvENG ✍️: https://t.co/DBjsJNDgkY pic.twitter.com/NCDDqeCfLT
— ICC (@ICC) February 22, 2025
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..