ఆసియా క్రీడల నుంచి టీమిండియా ఔట్.. సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ.. ఎందుకంటే?

Asian Games Cricket: ఆసియా క్రీడల్లో క్రికెటర్ల వసతి, సౌకర్యాలపై బీసీసీఐతో సహా ఐదు టెస్ట్ క్రికెట్ దేశాల బోర్డులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. క్రీడా మైదానంలో సరైన డ్రెస్సింగ్ రూములు లేకపోవడం, వాష్‌రూమ్‌లు దూరంగా ఉండటం, ఆటగాళ్లకు కేటాయించిన రూములు చాలా చిన్నవిగా ఉండటం ప్రధాన సమస్యలుగా మారాయి.

ఆసియా క్రీడల నుంచి టీమిండియా ఔట్.. సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ.. ఎందుకంటే?
Ind Vs Pak Asian Games

Updated on: Aug 29, 2026 | 2:15 PM

BCCI and Cricket Boards Express Dismay Over Substandard Facilities at Asian Games: ఆసియా క్రీడల పురుషుల విభాగంలో పాల్గొంటున్న పది క్రికెట్ జట్లలో, ఐదు టెస్ట్ క్రికెట్ దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు క్రీడల వసతి, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, క్రికెట్ మ్యాచ్‌లకు వేదికైన కరోగి పార్క్‌లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు లేవు. మ్యాచ్ జరిగే సమయంలో క్రికెటర్లు బౌండరీ బయట ఏర్పాటు చేసిన టెంట్లలోనే ఉండాల్సి వస్తుంది. కనీసం 500 మీటర్లు నడిస్తే గానీ వాష్‌రూమ్ సౌకర్యం అందుబాటులో లేదు.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: లంక ఎఫెక్ట్.. కీవిస్‌తో సిరీస్ నుంచి ఐదుగురు ఔట్.. ఇకపై ఎంట్రీ కష్టమే..?

ఇవి కూడా చదవండి

ఆటగాళ్లకు మైదానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వసతి ఏర్పాటు చేయగా, ఈ గదులు మరీ చిన్నవిగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. లగేజీ, క్రికెట్ బ్యాగ్‌లతో కలిపి ఇద్దరు క్రికెటర్లు కలిసి ఉండలేని విధంగా రూములు ఉన్నాయని ఒక బోర్డు అధికారి పేర్కొన్నారు. ఒక ప్లేయర్ తన కిట్ బ్యాగ్ తెరిస్తే మరో ఆటగాడు నిలబడటానికి కూడా స్థలం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై ఆసియా క్రీడల నిర్వాహకులతో చర్చించి సౌకర్యాలను సమీక్షించాలని బోర్డులు భావిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, భారత్ తరఫున ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం జట్టును మార్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా పూర్తిస్థాయి టీ20 జట్టును బరిలోకి దింపుతోంది.

ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us