SL vs PAK: ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా భారత అభిమానులపై వివక్ష చూపించారు. పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ చూసేందుకు భారత అభిమానులకు ఎంట్రీ ఇవ్వలేదు. ఇందుకు గల కారణం ఏంటంటే.. భారత జెర్సీ ధరించడమేనని అభిమానులు చెబుతున్నారు. దీంతో శ్రీలంక లేదా పాకిస్తాన్ జెర్సీలను ధరించాల్సి వచ్చిదంటూ వారు వాపోయారు. భారత జెర్సీలు ధరించినందుకు తనను, మరో ఇద్దరు అభిమానులను స్టేడియంలోకి అనుమతించలేదని టీమ్ ఇండియాకు మద్దతిచ్చే ‘భారత్ ఆర్మీ’ ఫ్యాన్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీమ్ ఇండియా జెర్సీ ధరించి మ్యాచ్‌కు వెళ్లలేకపోవడం చాలా షాకింగ్’ అంటూ ‘భారత్ ఆర్మీ’ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.
ఐసీసీ, ఎసీసీని ట్యాగ్ చేస్తూ – మా సభ్యులు కొందరు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. అక్కడ స్థానిక అధికారి, పోలీసులు స్టేడియంలోకి ఎంట్రీ లేదంటూ చెప్పారు. దారుణంగా ప్రవర్తించారంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా వారు పోస్ట్ చేశారు.
Totally agree mate as I said first 3 days we had such a fantastic time with the @ECB_cricket boys. Literally only a minor few people killed it. https://t.co/WzYN7Spwug
— Trust The Process!!!! (@AnilSehmi) July 4, 2022
? SHOCKING TREATMENT as The Bharat Army and other Indian Cricket Fans told they can not enter the stadium wearing ‘India jerseys’! #BharatArmy #PAKvSL pic.twitter.com/5zORYZBcOy
— The Bharat Army (@thebharatarmy) September 11, 2022
భారత అభిమానులపై వివక్ష చూపడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ భారత అభిమానులతో ఇలానే ప్రవర్తించారు. 5వ టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ అభిమానులు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఈసీబీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టి నిందితులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.
భారత్ ఆర్మీ అంటే ?
‘భారత్ ఆర్మీ’ అనేది భారత క్రికెట్ జట్టు అభిమానుల సమూహం. టీమ్ ఇండియాను ఫాలో అవుతూ దేశ విదేశాల్లో జరిగే మ్యాచ్‌లు చూసేందుకు వెళ్తుంటారు. ఈ బృందం 1999లో ఏర్పడింది.
టీమ్ ఇండియా ఆసియా కప్‌లో సూపర్-4 దశకు చేరుకున్న రోహిత్ ఆర్మీ సూపర్-4 దశ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. సూపర్-4 రౌండ్‌లో మూడింటిలో ఒక మ్యాచ్ గెలిచింది. 2 మ్యాచుల్లో ఓడిపోయింది. జట్టుకు 2 పాయింట్లు వచ్చాయి. లీగ్ రౌండ్‌లోని రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సూపర్-4లోకి ప్రవేశించింది. ఇక్కడి నుంచి భారత్ ఇంటికి తిరుగుముఖం పట్టింది.