
India vs Bangladesh Highlights, Asia Cup 2025, Todays Super Fours Match Updates in Telugu: ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్.
ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ 17 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. సైఫ్ హసన్ మరియు, నసుమ్ హసన్ క్రీజులో ఉన్నారు. సైఫ్ హసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు డ్రాప్ చేసి, హాఫ్ సెంచరీ చేసేలా అవకాశాలు ఇచ్చారు.
బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 5 వికెట్లకు 87 పరుగులు చేసింది. సైఫ్ హసన్, మహ్మద్ సైఫుద్దీన్ క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్ 6.2 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేసింది. సైఫ్ హసన్, తౌఫిక్ హ్రిడోయ్ క్రీజులో ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా తన తొలి ఓవర్లోనే భారత్ కు వికెట్ ఇచ్చాడు. తంజిద్ హసన్ (1 పరుగు) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 169 పరుగుల టార్గెట్ ఉంది.
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అంతకు ముందు అభిషేక్ శర్మ 75 పరుగుల వద్ద రనౌటై త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ , తిలక్ వర్మ ఉన్నారు.
బంగ్లాతో జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 60) దూకుడుగా ఆడుతుండడంతో 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. 9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 91/2.
అభిషేక్ శర్మ బంగ్లా బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న అతను కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి.
Yet another fine half-century by @IamAbhiSharma4 off just 25 deliveries 👏👏
Live – https://t.co/2CvdQIp2qu #INDvBAN #AsiaCup2025 #Super4 pic.twitter.com/laVvltrvNc
— BCCI (@BCCI) September 24, 2025
బంగ్లాతో జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా ప్రయాణిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ (19 బంతుల్లో 47) దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా 76 పరుగులు చేసింది.
బంగ్లాతో జరుగుతోన్న కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు అదరగొడుతున్నారు. పోటా పోటీగా బౌండరీలు కొడుతున్నారు. దీంతో 5 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 50 పరుగులు దాటింది.
Fifty Partnership 🆙#TeamIndia openers have begun strongly 👌
It is 55/0 after 5 overs
Updates ▶️ https://t.co/bubtcR19RS#TeamIndia | #AsiaCup2025 | #Super4 | @ShubmanGill | @IamAbhiSharma4 pic.twitter.com/s2G20oxKVY
— BCCI (@BCCI) September 24, 2025
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేం ముందుగా బ్యాటింగ్ చేయడం పట్ల సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే, గత కొన్ని మ్యాచ్‌లుగా ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మేం ప్లేయింగ్ XIలో ఎటువంటి మార్పులు చేయడం లేదు” అని అన్నారు.
టాస్ ఓడిపోయిన టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించింది. అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రత్యర్థి వైపు తంజీమ్ హసన్ షకీబ్ బంతి అందుకున్నాడు. మొదటి ఓవర్ లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.
బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లిటన్ దాస్ స్థానంలో జాకీర్ అలీ టాస్ వేసేందుకు వచ్చాడు. “ప్రాక్టీస్ సెషన్‌లో లిటన్ గాయపడ్డాడు. గత మ్యాచ్ నుంచి మేం ప్లేయింగ్ XIలో నాలుగు మార్పులు చేశాం” అని అతను వివరించాడు.
భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ తమ జట్టులో మునుపటి మ్యాచ్ నుంచి నాలుగు మార్పులు చేసింది.
సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్.
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీస్తే, అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశపు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారవచ్చు. ప్రస్తుతం హార్దిక్ 97 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. నంబర్ వన్‌లో ఉన్న ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 100 వికెట్లు సాధించాడు.
పాకిస్తాన్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఆడిన ప్లేయింగ్ XI నే భారత జట్టు బరిలోకి దించే అవకాశం ఉంది. అంటే, శుభ్మాన్ గిల్ మరోసారి అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు.
బంగ్లాదేశ్ ఆడే XI లో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. షోరిఫుల్ ఇస్లాం స్థానంలో తాంజిమ్ హసన్ కూడా జట్టులోకి రావచ్చు.
6 సంవత్సరాల క్రితం భారత్‌పై బంగ్లాదేశ్ ఏకైక టీ20ఐ విజయం సాధించింది. నవంబర్ 2019లో, బంగ్లాదేశ్ జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో భారత్‌ను ఓడించింది.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టీ20ఐ రికార్డు చాలా ఏకపక్షంగా ఉంది. రెండు జట్ల మధ్య మొత్తం 17 టీ20ఐ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత జట్టు 16 సార్లు గెలిచింది. బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది.
ఈరోజు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో మూడు దుబాయ్‌లోని ఈ మైదానంలో జరిగాయి.