Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆలస్యానికి అసలు కారణం భారత్-పాక్ మ్యాచ్?

Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023కి సంబంధించి షెడ్యూల్ ఇప్పటి వరకు రాలేదు. అయితే, ఆ తర్వాత జరగాల్సిన ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా కప్ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు వేదికలను ఖరారు చేసేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్, శ్రీలంకలతో చర్చలు జరుపుతోంది.

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆలస్యానికి అసలు కారణం భారత్-పాక్ మ్యాచ్?
Ind Vs Pak Match

Updated on: Jul 03, 2023 | 11:15 AM

Asia Cup 2023 Schedule Delay: ఆసియా కప్ 2023కి సంబంధించి షెడ్యూల్ ఇప్పటి వరకు రాలేదు. అయితే, ఆ తర్వాత జరగాల్సిన ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా కప్ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు వేదికలను ఖరారు చేసేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్, శ్రీలంకలతో చర్చలు జరుపుతోంది. వేదికల కారణంగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఆలస్యం అవుతోందంట. అయితే, ఈవారం వీటిపై క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో లాహోర్, శ్రీలంకలో దంబుల్లా మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. గతంలో శ్రీలంక నుంచి కొలంబో ఎంపికైంది. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ మార్చారని తెలుస్తోంది. అయితే ఈ వారంలోగా శ్రీలంక వేదికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట.

‘ఇన్‌సైడ్‌స్పోర్ట్’తో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, “కొన్ని చివరి నిమిషంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. తాత్కాలిక షెడ్యూల్ సభ్యులతో మాట్లాడారు. ఈ వారంలోగా విడుదల కావాలి. రుతుపవనాల కారణంగా కొలంబోలో సమస్య ఉంది. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. కానీ, వర్షం సమస్య కావచ్చు’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

హైబ్రిడ్ మోడల్ కింద, పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 టోర్నీ ఆగస్టు 31న మొదలు కానుంది. సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. శ్రీలంకలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించిన కొత్త పీసీబీ ఛైర్మన్..

హైబ్రిడ్ మోడల్‌కు సంబంధించి పాకిస్తాన్ కొత్త ఛైర్మన్ జకా అష్రఫ్ ప్రశ్నలు లేవనెత్తారు. జకా అష్రఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “మొదటి విషయం ఏమిటంటే, నేను గతంలో హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించాను. ఎందుకంటే నేను దానిని అంగీకరించలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డు దీనిని పాకిస్థాన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

హైబ్రిడ్ మోడల్‌లో ఎలాంటి మార్పు ఉండదు..

బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, “హైబ్రిడ్ ప్లాన్‌ను మార్చే ప్రశ్నే లేదు. హైబ్రిడ్ మోడల్‌ను అభ్యర్థించింది PCB అని మర్చిపోవద్దు. ప్రతి కొత్త అధ్యక్షుడి.. ఆయన వైఖరిని మార్చుకోవచ్చు. కానీ, అది ఒక వ్యక్తి ఇష్టానుసారం పని చేయదు. లాజిస్టిక్స్, బ్రాడ్‌కాస్టర్‌లు, ఇతర విషయాలతోపాటు ప్రమేయం ఉంటుంది” అని ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..