Asia Cup 2023: పాకిస్తాన్‌‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు.. ఆసియా కప్ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

|

Jun 15, 2023 | 6:10 PM

Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌పై సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా కప్ జరగనున్నట్లు వార్తలు వచ్చిన కొద్దిరోజుల్లోనే, షెడ్యూల్ కూడా ఏఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీని రెండు దేశాల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Asia Cup 2023: పాకిస్తాన్‌‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు.. ఆసియా కప్ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Ind Vs Pak On Asia Cup Venue
Follow us on

ఆసియా కప్‌పై సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆసియా కప్ జరగనున్నట్లు వార్తలు వచ్చిన కొద్దిరోజుల్లోనే, షెడ్యూల్ కూడా ఏఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీని రెండు దేశాల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. టోర్నమెంట్ ఆగస్టు 31న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈసారి టోర్నీ రెండు గ్రూపులుగా జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమాచారం. రెండు గ్రూపుల నుంచి తలో 2 జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 రౌండ్‌లో టాప్ 2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

వన్డే ఫార్మాట్‌లో టోర్నీ..

ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. ప్రపంచ కప్ సన్నాహక పరంగా అన్ని ఆసియా జట్లకు ఆసియా కప్ చాలా ముఖ్యమైన టోర్నమెంట్. ఈ టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు కూడా ఆడనున్నాయి.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ..

ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సింది. కానీ, టీమ్‌ఇండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. హైబ్రీడ్ మోడల్‌ తెరపైకి వచ్చింది. పీసీబీ మొండి వైఖరితో పాకిస్తాన్‌లోనే టోర్నమెంట్‌ను నిర్వహించాలని పట్టుబట్టింది. అయితే చివరకు బీసీసీఐ, ఇతర క్రికెట్ బోర్డుల ఒత్తిడితో పీసీబీ తల వంచాల్సి వచ్చింది. ఆసియా కప్ ఫైనల్ శ్రీలంకలోనే జరగనుంది.

టీమిండియాకు ఆసియా కప్ కీలకం..

భారత క్రికెట్ జట్టుకు ఆసియా కప్ చాలా ముఖ్యమైంది. ఈసారి వరల్డ్ కప్ భారత్ లోనే జరగాల్సి ఉండగా టీమ్ ఇండియా సన్నాహాలు ఎలా ఉన్నాయో ఆసియాకప్ తోనే తెలిసిపోతుంది. గతేడాది జరిగిన ఆసియాకప్‌లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. పాకిస్థాన్, శ్రీలంక మధ్య టైటిల్ పోరు జరిగింది. ఆసియా కప్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గతేడాది ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగినప్పటికీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..