Asia Cup 2023: వాన దేవుడి ఎఫెక్ట్‌.. ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పు! కొలంబో నుంచి ఎక్కడికంటే?

|

Sep 11, 2023 | 11:59 AM

కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసియా కప్ మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో సూపర్‌ 4 మ్యాచ్‌లను కొలంబో నుంచి తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) క్లారిటీ ఇచ్చింది. అయితే ఏసీసీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 17న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

Asia Cup 2023: వాన దేవుడి ఎఫెక్ట్‌.. ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పు! కొలంబో నుంచి ఎక్కడికంటే?
Indian Cricket Team
Follow us on

కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసియా కప్ మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో సూపర్‌ 4 మ్యాచ్‌లను కొలంబో నుంచి తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) క్లారిటీ ఇచ్చింది. అయితే ఏసీసీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 17న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ మ్యాచ్ ను కొలంబో కాకుండా క్యాండీలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వర్గాల సమాచారం ప్రకారం, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17 ఆదివారం క్యాండీలోని పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సోమవారం (సెప్టెంబర్ 11న) భారత్ వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌ జరగకపోతే ఫైనల్ వేదికను మార్చడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా కొలంబోలో భారీ వర్షం కారణంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన సూపర్ 4 మ్యాచ్ కూడా రిజర్వ్ డేకి వాయిదా పడింది. అయితే రిజర్వ్ రోజు కూడా భారీ వర్షం కురిసే సూచన ఉందని, ఈ రోజు కూడా మ్యాచ్ జరిగే అవకాశం లేదని సమాచారం. కొలంబోలో కురుస్తోన్న కుండపోత వర్షాల కారణంగా సూపర్ 4 మ్యాచ్‌లను కొలంబో నుండి హంబన్‌తోటాకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే వర్షం కారణంగా టోర్నమెంట్ ఆలస్యం అవుతుందనే భయం ఉన్నప్పటికీ, సూపర్ 4 మ్యాచ్‌లను కొలంబోలో ఆడాలని నిర్ణయించుకుంది. అయితే వర్షాలు ఏ మాత్రం తగ్గకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌ను కొలంబో నుంచి క్యాండీకి మార్చాలని ఏసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఆదివారం (సెప్టెంబర్ 10న) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కాగానే ఎండ బాగానే ఉంది. కాబట్టి వాతావరణ సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌లు తప్పుడు సమాచారం ఇచ్చాయని అందరూ భావించారు. అయితే భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉన్నట్లుండి వర్షం ప్రారంభం కావడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడి చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. రిజర్వ్‌డే ఉండడంతో నేటి మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈరోజు కూడా కొలంబోలో 80 నుండి 90 శాతం వర్షం పడే అవకాశం ఉంది. Accuweather ప్రకారం కొలంబోలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని, Weather.com 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ ఫైనల్ పై కీలక అప్డేట్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..