
IND vs PAK, Asia Cup 2023 Scheduled: ఆసియా కప్ 2023 అధికారిక షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు. ఈ క్రమంలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆసియా కప్‌లో తొలి 4 మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్‌లో, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. అలాగే ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య కనీసం 3 మ్యాచ్ లు జరుగుతాయని ఆశతో ఉన్నారు. ఆసియా కప్ షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో భారత్, పాకిస్థాన్‌లు మూడుసార్లు తలపడనున్నాయి.
రాబోయే ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అయితే టోర్నమెంట్‌లో రెండు చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్తాన్‌లు మూడుసార్లు తలపడతాయని అంతా భావిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల తేదీలు కూడా నివేదికలో ప్రకటించారంట. పాకిస్థాన్ మీడియా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉండగా, తదుపరి రౌండ్ రెండో మ్యాచ్ సెప్టెంబర్ 10న జరిగే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు కొలంబో లేదా శ్రీలంకలోని క్యాండీలో జరిగే అవకాశం ఉంది. కాగా, ఇరు జట్లు ఫైనల్ చేరితే టోర్నీలో భారత్-పాకిస్థాన్ మూడో మ్యాచ్ సెప్టెంబర్ 17న జరిగే అవకాశం ఉంటుంది.
బీసీసీఐ, పీసీబీ హైబ్రిడ్ మోడల్‌పై అంగీకరించిన తర్వాత, ప్రధాన ప్రత్యర్థులు ఒకరితో ఒకరు మూడుసార్లు తలపడతాయని నివేదికలు వెలువడుతున్నాయి. ఇండియా vs పాకిస్తాన్ ఆసియా కప్ 2023 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంకలోని క్యాండీ లేదా దంబుల్లాలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నారంట. పాకిస్థాన్ తన తొలి గ్రూప్ మ్యాచ్‌ని నేపాల్‌తో ఆగస్టు 30 లేదా 31న ముల్తాన్‌లో ఆడనుంది. అదే రోజు ముల్తాన్‌లో టోర్నీ ప్రారంభోత్సవం కూడా జరగనుంది. పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ మ్యాచ్‌లకు లాహోర్ మరో వేదిక కానుంది.
ప్రతిపాదిత షెడ్యూల్‌కు ఆమోదం లభిస్తే, నేపాల్‌తో తొలి మ్యాచ్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయలుదేరుతుంది. ఇదిలావుండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తమ లీగ్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో ఆడనున్నాయి. మిగిలిన మ్యాచ్‌ల కోసం శ్రీలంకకు వెళ్తాయి. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో పీసీబీ మాజీ మేనేజ్‌మెంట్ కమిటీ నజామ్ సేథీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. అనేక సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చివరకు హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. ఇందులోభాగంగా, టోర్నీలో మొదటి నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. ఆ తర్వాత శ్రీలంకలో చివరి మ్యాచ్‌తో సహా తొమ్మిది మ్యాచ్‌లు జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..