బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన యాషెస్ సరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం లంచ్ సమయానికి ఇంగ్లండ్‌ను 297 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. పెద్దగా కష్టపడకుండానే 20 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండు వికెట్ల నష్టానికి 220 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 297 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లియాన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు.
అతను టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లు దాటిన మూడో ఆటగాడిగా నిలిచాడు. నాలుగో రోజు తన రెండో ఓవర్లో షేవ్-హెడ్డ్ 34 ఏళ్ల డేవిడ్ మలన్ (82)ను ఔట్ చేశాడు. తర్వాత ఇంగ్లాండ్ వెనువెంటనే 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 77 పరుగులకు ఎనిమిది కోల్పోయి ఆలౌట్ అయింది. జో రూట్ 89 పరుగులు చేశాడు. స్టార్క్, హెజీల్ వుడ్ ఒక్కో వికెట్ తీశారు. కంగారుల బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్, గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జో రూట్ 39, పొప్ 35 పరుగులు చేశారు. కెప్టెన్ కమ్మిన్స్ ఐదు వికెట్ల పడగొట్టాడు. స్టార్క్, హజీల్ వుడ్ రెండేసి వికెట్లు తీశారు. గ్రీన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెన్ డేవిడ్ వార్నర్ 94, లాంబ్షింగే 74, హెడ్ 152 పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్ వుడ్ మూడేసి వికెట్లు, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. లీచ్, రూటో ఒక్కో వికెట్ తీశారు.
Read Also.. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం చెమటోడ్చుతున్న రోహిత్.. ప్రాక్టీస్ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..