AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘ఇక నువ్ మారవా.. సొంత జట్టు ఆటగాడిపై ఈ పైత్యం ఏంది.. ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి’

Arshdeep Singh Controversy: సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవాల్సిన అంతర్జాతీయ క్రికెటర్, ఇలా వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. మైదానంలో రాణించడమే కాకుండా, తోటి ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అర్ష్‌దీప్ సింగ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు గుర్తిస్తేనే వారి కెరీర్‌కు, జట్టుకు మంచిది.

Video: 'ఇక నువ్ మారవా.. సొంత జట్టు ఆటగాడిపై ఈ పైత్యం ఏంది.. ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి'
Punjab Kings
Venkata Chari
|

Updated on: May 22, 2026 | 3:48 PM

Share

Arshdeep Singh Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగుతుండగా, పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. మైదానంలో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న అతను, సామాజిక మాధ్యమాల్లో తోటి ఆటగాళ్లను కించపరిచేలా ప్రవర్తిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజా వివాదం పంజాబ్ జట్టులో కలకలం రేపుతోంది.

మళ్లీ దొరికిపోయిన అర్ష్‌దీప్.. ఈసారి ప్రియాంశ్ ఆర్య లక్ష్యంగా..!

కొద్దిరోజుల క్రితమే తిలక్ వర్మ, సాయి సుదర్శన్‌లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన అర్ష్‌దీప్ సింగ్, ఆ వివాదం సద్దుమణగక ముందే మరో వివాదానికి తెరలేపాడు. ఈసారి పంజాబ్ కింగ్స్‌లో తనతో పాటు ఆడుతున్న యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌లు కలిసి ఆటపట్టించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో అర్ష్‌దీప్ నేరుగా కనిపించకపోయినప్పటికీ, అతని గొంతు స్పష్టంగా వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో SRH ఎంట్రీ అవ్వాలంటే.. RCBపై ఎంత తేడాతో గెలవాలంటే?

ప్రియాంశ్ ఆర్య పళ్ల వరుసను, అతని నవ్వును ఎగతాళి చేస్తూ అర్ష్‌దీప్ మాట్లాడిన మాటలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఫోన్ మాట్లాడుతున్న యువ ఆటగాడు తీవ్ర అసౌకర్యానికి గురై, తలదించుకుని బస్సు కిటికీ వైపు చూస్తున్నా వదలకుండా వెక్కిరించడం వీడియోలో కనిపించింది.

నెటిజన్ల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుండటంతో క్రికెట్ అభిమానులు అర్ష్‌దీప్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీన్ని కేవలం తమాషాగా చూడలేమని, ఇది ముమ్మాటికీ తోటి ఆటగాడిని మానసికంగా వేధించడమేనని మండిపడుతున్నారు. “సదరు యువ ఆటగాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది” అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న అర్ష్‌దీప్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

మైదానంలోనూ నిరాశపరుస్తున్న ఫామ్..

టీ-20 ప్రపంచకప్ విజయం తర్వాత అలసటతో ఉన్నాడో ఏమో కానీ, ఈ ఐపీఎల్ సీజన్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ అస్సలు బాగాలేదు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. పరుగులను భారీగా సమర్పించుకుంటూ దాదాపు 10 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయడం పంజాబ్ జట్టును దెబ్బతీసింది. టోర్నీ మొదటి సగంలో అద్భుతంగా రాణించిన పంజాబ్ బౌలింగ్ విభాగం, ద్వితీయార్థంలో పూర్తిగా చేతులెత్తేసింది.

ఇది కూడా చదవండి: ‘ఎవరున్నా లేకపోయినా.. 2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఉంటే చాలు.. ట్రోఫీ టీమిండియాదే..’

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే కింది సమీకరణాలు కలిసిరావాలి:

పంజాబ్ కింగ్స్ తన తదుపరి చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా భారీ విజయం సాధించాలి.

రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచినా పంజాబ్‌కు వచ్చే నష్టం లేదు కానీ, వారు భారీ రన్ రేట్‌తో గెలిస్తే మాత్రం పంజాబ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా
పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా
మరో వివాదంలో టీమిండియా ప్లేయర్.. సొంత జట్టు ఆటగాడిపైనే వేధింపులు
మరో వివాదంలో టీమిండియా ప్లేయర్.. సొంత జట్టు ఆటగాడిపైనే వేధింపులు
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే