Arjun tendulkar: ముంబై ఇండియన్స్‌లో అర్జున్‌ టెండూల్కర్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. సచిన్‌ ఏమన్నాడు..

|

May 24, 2022 | 7:10 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లోని రెండు సీజన్‌లలో ముంబై ఇండియన్స్‌ ఆడిన 28 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్(sachin tendulkar) కుమారుడు అర్జున్(Arjun tendulkar) ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాలేదు. ..

Arjun tendulkar: ముంబై ఇండియన్స్‌లో అర్జున్‌ టెండూల్కర్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. సచిన్‌ ఏమన్నాడు..
Ipl 2022 Sachin
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లోని రెండు సీజన్‌లలో ముంబై ఇండియన్స్‌ ఆడిన 28 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్(sachin tendulkar) కుమారుడు అర్జున్(Arjun tendulkar) ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాలేదు. దీనిపై సచిన్ స్పందించాడు. కష్టపడి పని చేయాల్సి ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్ తన కొడుకు అర్జున్‌కు స్పష్టంగా చెప్పాడడు. ముంబై ఇండియన్స్‌తో అసోసియేట్‌గా ఉన్న టెండూల్కర్ కూడా ఎంపిక విషయాల్లో జోక్యం చేసుకోనని స్పష్టం చేశాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అర్జున్ టెండూల్కర్‌ను ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. అయితే ఈ లీగ్‌లోని రెండు సీజన్‌లలో అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు.

‘అర్జున్‌ దారి సవాలుగా ఉంటుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ టెండూల్కర్, ఎంపికకు సంబంధించినంతవరకు, అతను జట్టు మేనేజ్‌మెంట్‌కు వదిలివేస్తానని చెప్పాడు. ‘మేము ఎంపిక గురించి మాట్లాడినట్లయితే, నేను ఎన్నడూ ఎంపికలో పాల్గొనను. నేను ఎప్పుడూ ఇలాగే పనిచేశాను కాబట్టి ఈ విషయాలన్నీ టీమ్ మేనేజ్‌మెంట్‌కే వదిలేస్తున్నాను. 22 ఏళ్ల అర్జున్ తన కెరీర్‌లో ఇప్పటివరకు తన సొంత జట్టు ముంబై తరఫున కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

IPL 2022లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా విఫలమైంది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇది దాని IPL చరిత్రలో చెత్త ప్రదర్శన. ముంబై ఇండియన్స్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోయింది. తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, డెవాల్డ్ బ్రెవిస్, రమణదీప్ సింగ్‌లతో సహా పలువురు ఆటగాళ్లకు జట్టు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్  చేయండి..