Arjun Tendulkar : ఐపీఎల్-14‌లో ఎంట్రీ ఇవ్వనున్న అర్జున్ టెండూల్కర్.. కనీస ధర ఎంతంటే..?

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతన్నాడు. ఈ నెల 18న మెగా టోర్నీ వేలం జరగనుండగా, 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో తన పేరును ఎంట్రీ చేసుకున్నాడు.

Arjun Tendulkar : ఐపీఎల్-14‌లో ఎంట్రీ ఇవ్వనున్న అర్జున్ టెండూల్కర్.. కనీస ధర ఎంతంటే..?

Updated on: Feb 06, 2021 | 12:33 AM

Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం.. క్రికెట్ ప్రేముకుల ప్రత్యేక్ష దైవం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతన్నాడు. ఈ నెల 18న మెగా టోర్నీ వేలం జరగనుండగా, 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో తన పేరును ఎంట్రీ చేసుకున్నాడు.

అండర్-19 టోర్నీలలో అర్జున్ దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ…, దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో ఐపీఎల్‌ గత సీజన్‌లలో పేరు నమోదు చేసుకునే అర్హత లేకుండా పోయింది. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జూనియర్ టెండూల్కర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.

దీంతో ఐపీఎల్‌ వేలానికి అర్హత సాధించాడు. వేలంలో అతడిని ఏ జట్టు సొంతం చేసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేయనున్నాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ

Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..