Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందన ఏంటో తెలుసా.. సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..?

|

Sep 17, 2021 | 8:56 AM

Anushka Sharma: విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాలో స్పందించారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందన ఏంటో తెలుసా.. సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..?
Virat Kohli Anushka Sharma
Follow us on

Virat Kohli: టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం ప్రకటించాడు. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం చూసి అతని అభిమానులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని విరాట్ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ద్వారా సింబాలిక్ రియాక్షన్ ఇచ్చారు.

అనుష్క శర్మ ప్రముఖ బాలీవుడ్ నటి. అనుష్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భర్త విరాట్ కోహ్లీ టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విరాట్ లేఖను పంచుకుని, లవ్ సింబల్ ఎమోజీని ఉంచి తన నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించింది.

సెలబ్రిటీల స్పందన..
అదే సమయంలో విరాట్ ఈ నిర్ణయంపై బాలీవుడ్ ప్రముఖులందరూ తమ స్పందనను తెలియజేశారు. విరాట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. తనూజ్ విర్వానీ.. ‘ఇది మంచి నిర్ణయం. బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరింత అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాము’ అంటూ రాసుకొచ్చారు. అలాగే సింగర్ టోనీ కక్కర్ లవ్ ఎమోజీని పంచుకుని కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించారు.

సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన తర్వాత అనుష్క శర్మ, విరాట్ 2017 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఇటలీలో చాలా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న అనుష్క శర్మ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు వామిక అనే పేరు పెట్టారు. అనుష్క చాలా కాలంగా నటనకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా పనిచేస్తోంది. గత సంవత్సరం అనుష్క ‘పాటల్ లోక్’ అమెజాన్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. అలాగే ‘బుల్బుల్‌’ను కూడా నిర్మించింది. వీటికి చాలా మంచి స్పందన వచ్చింది.

విరాట్ కోహ్లీ తన రాజీనామా లేఖలో.. ‘భారత క్రికెట్ టెస్ట్ జట్టు, వన్డే జట్టు కెప్టెన్సీకి సమయం ఇవ్వడానికి నాకు కొంత స్పేస్ కావాలి. అక్టోబర్‌ నుంచి దుబాయ్‌లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత తాను టీ 20 కెప్టెన్సీని విడిచిపెడతానని’ విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు.

Also Read:

Indian Cricket Team: కోహ్లీ తరువాత రోహిత్ శర్మ మాత్రమే కాదు.. కెప్టెన్ పోటీల్లో వీరు కూడా..!

Virat Kohli: 2023 వన్డే ప్రపంచ కప్‌ కోసమే టీ20 కెప్టెన్సీ వదిలేశాడా..? కోహ్లీ ప్లాన్ మాములుగా లేదంటోన్న మాజీలు