IND vs PAK: పాక్ పిట్ట బెదిరింపులకు భయపడేదేలే.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అనురాగ్‌ ఠాకూర్‌..

ODI World Cup 2023: వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచకప్‌‌లో ఆడేందుకు ప్రతి జట్టు వస్తుందని అనురాగ్‌ ఠాకూర్‌ పీసీబీకి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.

IND vs PAK: పాక్ పిట్ట బెదిరింపులకు భయపడేదేలే.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అనురాగ్‌ ఠాకూర్‌..
Anurag Thakur

Updated on: Oct 20, 2022 | 2:46 PM

భారత్‌లో ప్రపంచకప్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడేందుకు ప్రతి పెద్ద జట్టు వస్తుందని అనురాగ్ ఠాకూర్ తేల్చి చేప్పారు. భారతదేశం క్రీడలకు పవర్‌హౌస్ అని, ముఖ్యంగా క్రికెట్‌కు చాలా ఇచ్చిందని, ఈ విషయంలో ఎవరి మాట వినబోమని అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడకూడదని పీసీబీ బుధవారం బెదిరించిన సంగతి తెలిసిందే.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈవెంట్‌లో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఇది బీసీసీఐకి సంబంధించిన విషయం. ఈ విషయంపై వారు కూడా స్పందిస్తారు. భారతదేశం ఒక క్రీడా శక్తి. అనేక ప్రపంచ కప్‌లు ఇక్కడ నిర్వహించాం. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ప్రతి ప్రధాన జట్టు ఇందులో పాల్గొంటుంది. ఎందుకంటే ఏ క్రీడలోనూ భారతదేశాన్ని విస్మరించలేరు. వచ్చే సంవత్సరం భారత్‌లో ప్రపంచకప్ జరుగుతుంది. దాని ఈవెంట్ గ్రాండ్‌గా ఉంటుంది. పాకిస్థాన్‌లో భద్రతకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నందున అక్కడికి వెళ్లడంపై హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించినది కాదు. భారతదేశం ఎవరి మాట వినే స్థితిలో లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతామంటూ పీసీబీ బెదిరింపులు..

ఆసియా కప్ 2023 ఆడేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ జైషా అక్టోబర్ 18న ప్రకటించారు. ఆ తర్వాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచే కాకుండా మాజీల వరకు జైషా నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. ఈ ప్రకటన తర్వాత పాకిస్థాన్‌లో భూకంపం వచ్చింది. ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే, భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనకూడదని పీసీబీకి సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో రెండు భారీ టోర్నమెంట్‌లు..

2023లో పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరగనుంది. ఇది వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అయితే భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదని, ఈ టోర్నీ తటస్థ వేదికగా జరుగుతుందని ఏసీసీ ప్రెసిడెంట్ జైషా ప్రకటించారు. ఆసియా కప్ తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్థాన్‌లోనే జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో ఆ టోర్నమెంట్ గురించి కూడా రచ్చ జరుగుతుంది.