
Anukul Roy : ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే శివాలెత్తారు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేకేఆర్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హిట్ మ్యాన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడగా, రికల్టన్ అతనికి ధీటుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఇద్దరూ సులభంగా సెంచరీలు పూర్తి చేసుకుంటారని అందరూ భావించిన తరుణంలో కోల్‌కతా ఫీల్డర్ అనుకూల్ రాయ్ ఒక అద్భుతంలా రంగప్రవేశం చేశాడు.
హిట్ మ్యాన్ కొంపముంచిన సూపర్ క్యాచ్
రోహిత్ శర్మ 38 బంతుల్లోనే 78 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వైభవ్ అరోరా వేసిన 12వ ఓవర్లో రోహిత్ ఒక భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న అనుకూల్ రాయ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి, నమ్మశక్యం కాని రీతిలో ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ మెరుపు క్యాచ్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడటమే కాకుండా, స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
Athleticism at its best 😮
🎥 Anukul Roy with a 𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹 𝗰𝗮𝘁𝗰𝗵 to end Rohit Sharma’s fabulous innings 🫴👏
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @KKRiders pic.twitter.com/pkLg4vjXOI
— IndianPremierLeague (@IPL) March 29, 2026
రికల్టన్ పతనం.. డ్రామా మధ్య రన్ అవుట్
మరోవైపు 43 బంతుల్లో 81 పరుగులు చేసి జోరుమీదున్న రాయన్ రికల్టన్‌ను కూడా అనుకూల్ రాయ్ తన ఫీల్డింగ్ మాయాజాలంతో పెవిలియన్ పంపాడు. బ్లెస్సింగ్ ముజరబానీ వేసిన 16వ ఓవర్లో రికల్టన్ లాంగ్-ఆఫ్ వైపు బంతిని పంపి రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోకి తిరిగి వచ్చే సమయంలో బౌలర్ ముజరబానీ అనుకోకుండా రికల్టన్ దారికి అడ్డువచ్చాడు. ఈ గందరగోళాన్ని క్యాష్ చేసుకున్న అనుకూల్ రాయ్, డీప్ నుంచి మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో విసిరి స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. అంపైర్లు దీనిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద కాకుండా సాధారణ రన్ అవుట్‌గానే ప్రకటించడంతో రికల్టన్ నిరాశగా వెనుదిరిగాడు.
Anukul Roy is putting on a show in the field 🫡
A direct-hit run-out from the deep to send back Ryan Rickelton 🎯
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @KKRiders pic.twitter.com/KaqLga2CWF
— IndianPremierLeague (@IPL) March 29, 2026
కోల్‌కతా పోరాడినా.. ముంబైకే విజయం
అనుకూల్ రాయ్ చేసిన ఈ రెండు కీలకమైన ఫీల్డింగ్ విన్యాసాలు ముంబైని కాస్త ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ భాగస్వామ్యం కారణంగా ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ చర్చించుకున్న పేరు మాత్రం అనుకూల్ రాయ్. ఒక్కడే ఇద్దరు సెంచరీ సాధించాల్సిన బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..