
భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అయిన అనయ బంగార్, ఇటీవల తన వ్యక్తిగత ప్రయాణం గురించి, అలాగే విరాట్ కోహ్లీతో ఉన్న ప్రేరణాత్మక అనుభందాలపై తన అనుభవాలను పంచుకుంది. ఫిల్మీగ్యాన్ తో మాట్లాడిన అనయ, కోహ్లీతో కలిసి చేసిన ట్రైనింగ్ సెషన్లను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో ఆమెకి విలువైన సలహాలు లభించాయని, ఇవి తన ఆటతీరు మీద ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నాయని చెప్పింది. అవును, నేను ఆయన్ను చాలా సార్లు కలిశాను, నా నాన్నతో కలిసి ట్రైన్ కూడా అయ్యాను. ఆయన నాకు కొన్ని సలహాలు ఇచ్చారు, నా బ్యాటింగ్ చూసారు, అలాగే ఆయన బ్యాటింగ్‌ను దగ్గరగా గమనించే అవకాశం నాకు దక్కింది, అని అనయ తెలిపింది.
అందులో ఒక మరిచిపోలేని సంభాషణగా, అనయ కోహ్లీని “ఎలాగు తాను అత్యున్నత స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు?” అని అడిగిన సందర్భాన్ని ప్రస్తావించింది. అప్పుడు ఆయన చెప్పిన విషయం నన్ను చాలా ప్రభావితం చేసిందని అన్నారు ‘నేను నా బలాలు ఏంటి అన్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకునేంత వరకు సాధన చేస్తాను. నేను మైదానంలో ఏమి చేయగలను అన్నదానిపై నాకెంతో నమ్మకం ఉంటుంది. అదే నన్ను నడిపిస్తుంది. నిజంగా మన ఆట గురించి మనకు పూర్తిగా అర్థం అయితే, మిగతా అన్నీ సరైనదిశగా సాగుతాయి అని అనయ తెలిపింది.
గత సంవత్సరం, అనయ బంగార్ తన ట్రాన్స్‌వుమన్‌గా మారిన ప్రయాణాన్ని పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. హార్మోనల్ మార్పుల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడి, ఇప్పుడు “అనయ బంగార్” అనే తన కొత్త పేరు తో గర్వంగా జీవిస్తోంది, ఇది ఆమె నిజమైన గుర్తింపుని సూచిస్తుంది. మే 14, బుధవారం రోజున అనయ సోషల్ మీడియా ద్వారా తన క్రికెట్ స్కిల్స్‌ను చూపే ఒక వీడియోను షేర్ చేసింది. ఆ క్లిప్‌లో ఆమె ఫ్రంట్ ఫుట్‌పై గట్టి డిఫెన్సివ్ టెక్నిక్‌లు, ఎలిగెంట్ స్ట్రెయిట్ డ్రైవ్స్‌తో ఆకట్టుకుంది. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసింది.. ఇంకా చెప్పలేదు కానీ… చాలా పెద్ద విషయం రాబోతోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ అనేక యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తున్నాడు. అతను ఇటీవల మే 12న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో వెస్టిండీస్‌తో తన టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ, భారత జాతీయ జట్టుకు నాల్గవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన రెడ్ బాల్ కెరీర్‌ను ముగించాడు. గత సంవత్సరం ఇప్పటికే టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, ప్రస్తుతం ODIలకు అందుబాటులో ఉన్నాడు. IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున మే 17న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీలో పాల్గొననున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..