WPL Auction: ఐపీఎల్ తర్వాత, ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం వేలం జరగనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌కు ఈసారి మినీ వేలం ఉంది. ఇది ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఈ వేలం ఈరోజు అంటే డిసెంబర్ 15వ తేదీన బెంగళూరులో జరగనుంది. ఇది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈసారి వేలానికి 120 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. WPLలో 5 జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో సహా 18 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్లు తమ జట్టును బలోపేతం చేయడానికి చాలా మంది స్టార్ ఆటగాళ్ల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడటం కనిపిస్తుంది.
ఈసారి వేలానికి ఎంపికైన 120 మంది ఆటగాళ్లలో 91 మంది భారతీయులు, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. అదే సమయంలో, ఈ జాబితాలో 82 మంది భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 8 అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు, వేలంలో గరిష్టంగా 19 మంది ఆటగాళ్లు మాత్రమే తీసుకోనున్నారు. ఎందుకంటే, ఇప్పుడు 5 జట్లతో సహా 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో 5 స్లాట్లు విదేశీ ఆటగాళ్లకు చెందినవి ఉన్నాయి.
29 మంది విదేశీ ఆటగాళ్లలో, అన్ని జట్లూ ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్, దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీపై కన్ను వేయబోతున్నాయి. ఈ ఆటగాళ్ల బేస్ ధర అత్యధికంగా రూ.50 లక్షలుగా ఉంది. అదే సమయంలో, ఇంగ్లండ్‌కు చెందిన లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, లారెన్ చీటిల్, దక్షిణాఫ్రికాకు చెందిన నాడిన్ డి క్లెర్క్ కూడా వేలంలో భాగమయ్యారు. వీళ్లంతా రూ. 30 లక్షల బేస్ ధరతో బరిలో నిలిచారు.
మరోవైపు, భారతదేశానికి చెందిన స్నేహ రాణా, పూనమ్ యాదవ్, శుభా సతీష్, మాన్సీ జోషి, తేజల్ హస్బ్నిస్ కూడా వేలంలో కనిపించబోతున్నారు. ఈ ఆటగాళ్లందరి బేస్ ధర సంవత్సరానికి రూ.30 లక్షలుగా ఉంది. వీరితో పాటు భారత్‌లోని కొంతమంది యువ ఆటగాళ్లు కూడా వేలంలోకి ప్రవేశించనున్నారు. ఇందులో 13 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అన్షు నగర్ పేరు ఎక్కువగా చర్చనీయాంశమైంది. మూడు నెలల క్రితం మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆమె మంచి ప్రదర్శన చేసింది. అలాగే, ఈ జాబితాలో 16 ఏళ్ల కమలిని కూడా చేరిపోయింది.
గతేడాది రూ.13.5 కోట్లుగా ఉన్న అన్ని జట్ల పర్స్ ఈసారి రూ.15 కోట్లకు పెరిగింది. అన్ని జట్లు తమ పర్స్‌లో ఎక్కువ భాగాన్ని నిలుపుదల సమయంలోనే ఖర్చు చేశాయి. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు అన్ని జట్లు వేర్వేరు పర్సులతో వేలంలోకి ప్రవేశిస్తాయి. గుజరాత్ జెయింట్స్ జట్టు అత్యధికంగా రూ.4.40 కోట్లతో వేలంలోకి ప్రవేశించనుంది. యూపీ వారియర్స్ జట్టు పర్స్‌లో రూ.3.90 కోట్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో, గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు తన పర్స్‌లో రూ. 3.25 కోట్లు మిగిలి ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇప్పుడు రూ.2.65 కోట్లు మిగిలాయి. కానీ, ఢిల్లీలో ఇప్పుడు కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే మిగిలాయి.
అయితే స్లాట్‌ల గురించి మాట్లాడితే, యూపీ వారియర్స్ జట్టులో 3 స్లాట్స్ ఉన్నాయి. బెంగళూరు విదేశీ ప్లేయర్‌ను కొనుగోలు చేయదు. ఇది కాకుండా, మిగిలిన 3 జట్లలో తలో 4 స్లాట్స్ ఉన్నాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్ మాత్రమే వేలంలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయగలిగింది. ఇది కాకుండా, అన్ని జట్లకు విదేశీ ఆటగాళ్లకు తలో ఖాళీ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..