Ranji Trophy 2022: జట్టులో చోటు కష్టమన్నారు.. సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు.. ఫాం లోకి వచ్చిన టీమిండియా ఆటగాడు..

గత కొన్ని రోజులుగా పేలవమైన ఫామ్‌ తో ఇబ్బంది పడుతూ జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు టీమిండియా టెస్ట్‌ ఆటగాడు అజింక్యా రహానే (Ajinkya Rahane).

Ranji Trophy 2022: జట్టులో చోటు కష్టమన్నారు.. సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు.. ఫాం లోకి వచ్చిన టీమిండియా ఆటగాడు..
Ajinkya Rahane

Updated on: Feb 17, 2022 | 9:15 PM

గత కొన్ని రోజులుగా పేలవమైన ఫామ్‌ తో ఇబ్బంది పడుతూ జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు టీమిండియా టెస్ట్‌ ఆటగాడు అజింక్యా రహానే (Ajinkya Rahane). ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటూ టెస్ట్ వైస్‌ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అయితే ఎట్టకేలకు ఈ ఆటగాడు ఫాంలోకి వచ్చాడు. నేడు ప్రారంభమైన రంజీ ట్రోఫీ (Ranji Trophy 2022) లో సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 250 బంతుల్లో 108 పరుగులు (14 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి వరుస వైఫల్యాలకు అడ్డుకట్ట వేశాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో ముంబయి జట్టు తరపున నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రహానే మొదట ఆచితూచి ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక తన గేర్‌ మార్చాడు. వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అజేయ సెంచరీ సాధించాడు.

జట్టులో చోటు ఖాయమే!

కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ దిగింది ముంబయి జట్టు. అయితే ఆరంభంలోనే పృథ్వీ షా (1), ఆకర్షిత్ గోమెల్ (8) వికెట్లు కోల్పోయి 22 ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి అడుగుపెట్టిన రహానే రహానే సర్ఫరాజ్ ఖాన్ (219 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రహానే, సర్ఫరాజ్‌ల సూపర్‌ సెంచరీల కారణంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి జట్టు 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. కాగా భారత క్రికెట్‌ జట్టు త్వరలోనే స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాధించిన సెంచరీతో శ్రీలంక‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ లో రహానే చోటు సంపాదించడం ఖాయంగా తెలుస్తోంది. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో రహానేను కోటి రూపాయల బేస్‌ ప్రైస్‌ కు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ఈ నేపథ్యంలో సూపర్‌ సెంచరీ సాధించిన అతనికి కంగ్రాట్స్‌ చెప్పింది కేకేఆర్‌ యాజమాన్యం.

Also Read: Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?

Manickam Tagore: ఉన్నట్లుండి మౌన మునిలా మారిపోయిన మాణికం ఠాగూర్!.. గాంధీ భవన్‌లో హాట్‌ టాపిక్‌గా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ వ్యవహారం..

Organ donation: పుట్టెడు దుఃఖంలోనూ వారికి సంతోషం పంచారు.. బిడ్డ మరణంలోనూ మానవత్వం చాటారు..