టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్‌పై విజయం సాధించినందుకు పాకిస్థానీయులు సంబురాలు చేసుకోవడం ఇంకా ఆపుకోలేదు. గాల్లోకి కాల్పులు జరపడం నుంచి మంత్రులు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి చర్యలను చూస్తే ఈ గెలుపు చాలా ముఖ్యమని తెలుస్తోంది. అయితే పాక్ గెలుపుపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం స్పందించారు. భారత్‌తో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలని తమ దేశం కోరుకుంటోందని అన్నారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఖాన్ పాల్గొన్నారు. టీ20 ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌పై తమ దేశం సాధించిన విజయం “చారిత్రకమైనది” అని పేర్కొన్నారు. “భారత్, పాకిస్తాన్ మంచి పొరుగు దేశాలుగా ముందుకు సాగవచ్చు” అని ఖాన్ చెప్పినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ ఢిల్లీతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందని ఖాన్ తెలిపారు. అయితే ఈ సంభాషణకు ఈ సమయం సరికాదని కూడా అన్నారు.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 151 పరుగులు చేసింది. 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Read Also.. Mohammed Shami: పాక్ అభిమానికి మహ్మద్ షమీ వార్నింగ్.. వైరల్‌గా మారిన వీడియో…