ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. ఆఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి చేధించింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో కేన్ విలియమ్స్ 99, రాస్ టేలర్ 48 పరుగులతో రాణించారు. ఆఫ్గన్ బౌలర్ ఆలమ్ కు మూడు వికెట్లు దక్కాయి.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ 41.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్‌లలో హష్మతుల్లా మినహా ఎవరూ రాణించలేకపోవడతో తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో నీషమ్‌కు 5 వికెట్లు, ఫెర్గూసన్‌కు 4 వికెట్లు దక్కాయి.