Virat Kohli: ఏం కర్మరా బాబు.! ఈ ముగ్గురు కోహ్లీ పాలిట విలన్లు.. ఎన్నిసార్లు అవుట్ చేశారో తెలిస్తే

ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే ఈలోగానే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి పెద్ద తలనొప్పి ఎదురొచ్చింది. ముగ్గురు బౌలర్లు కోహ్లీ పాలిట విలన్లుగా మారారు. అందులో ఒకరు ఇంగ్లాండ్ బౌలర్.. మరి అతడెవరో.? ఆ గణాంకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Virat Kohli: ఏం కర్మరా బాబు.! ఈ ముగ్గురు కోహ్లీ పాలిట విలన్లు.. ఎన్నిసార్లు అవుట్ చేశారో తెలిస్తే
Virat Kohli

Updated on: Feb 13, 2025 | 1:11 PM

ఎట్టకేలకు అహ్మదాబాద్ వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ 451 రోజుల తర్వాత వన్డే క్రికెట్‌లో అర్ధ సెంచరీ కొట్టాడు. ఒకానొక సమయంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడని అభిమానులు భావించారు. కానీ ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. కటక్‌లో విరాట్‌ను అవుట్ చేసిన ఆదిల్, అహ్మదాబాద్‌లో కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన మూడో బౌలర్‌గా ఆదిల్ రషీద్ చరిత్రలోకి ఎక్కాడు.

విరాట్ 11వ సారి అవుట్..

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ బ్యాట్ నుంచి ఆర్ద సెంచరీ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈసారి విరాట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాడని అనుకున్నారు. కానీ ఆదిల్ రషీద్ వికెట్ల వెనుక విరాట్ కోహ్లీని అవుట్ చేసి.. పెవిలియన్ పంపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ను 11వ సారి ఔట్ చేశాడు రషీద్. దీంతో విరాట్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్‌గా ఆదిల్ రషీద్ రికార్డుల్లోకి ఎక్కాడు.

హాజెల్‌వుడ్-సౌతీ రికార్డు సమం..

ఆదిల్ ప్రస్తుతం న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ టిమ్ సౌథీ, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ల సరసన చేరాడు. ఈ ఇద్దరు బౌలర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ను పదకొండు సార్లు ఔట్ చేశారు. వారిద్దరూ ఫాస్ట్ బౌలర్లు కాగా, రషీద్ స్పిన్నర్. కాగా, జేమ్స్ ఆండర్సన్, మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ను చెరో 10 సార్లు అవుట్ చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో, ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లలో కోహ్లీ, ఆదిల్ చాలాసార్లు తలపడ్డారు. రషీద్.. కోహ్లీని వన్డేల్లో ఐదుసార్లు, టెస్ట్ క్రికెట్‌లో నాలుగుసార్లు అవుట్ చేశాడు. అయితే టీ-20 ఇంటర్నేషనల్‌లో అతడిని రెండుసార్లు కోహ్లీ పెవిలియన్‌కు పంపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..