ఐపీఎల్ 2023 వేలానికి అర్హత కాని బౌలర్ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన స్పిన్‌తో మాయాజాలం సృష్టించాడు. 10 ఓవర్ల బౌలింగ్‌లో 7 మెయిడిన్లు వేయడమే కాదు.. 6 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అతడు మరెవరో కాదు యూఏఈ ఎడమ చేతి స్పిన్నర్ అయాన్ అఫ్జల్ ఖాన్. ACC పురుషుల ప్రీమియర్ కప్‌లో అయాన్ ఈ ఫీట్ సాధించాడు. యూఏఈ, బెహ్రెయిన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అయాన్ అద్భుత బౌలింగ్‌తో మంచి ఆటతీరు కనబరిచాడు. ఇందులో బెహ్రెయిన్ 116 పరుగులకు ఆలౌట్ కాగా, యూఏఈ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేధించింది.
ఈ మ్యాచ్‌లో జునైద్ సిద్దిఖీతో ఓపెనింగ్ బౌలింగ్‌కు దిగాడు అయాన్. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే సమర్పించాడు. అతడి ఎకానమీ రేటు 0.60. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో 7 మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. అలాగే 4 వికెట్లు కూడా తీశాడు.
వన్డేల్లో 7 ఓవర్లు మెయిడిన్లు వేయడం ద్వారా.. సూపర్ స్టార్స్ లీగ్‌లోకి చేరాడు అయాన్. ఈ ఫీట్‌లో అతడి కంటే ముందు వరుసలో బిషన్ సింగ్ బేడీ, ఫిల్ సిమ్మన్స్ ఉన్నారు. వీరిద్దరూ వన్డేల్లో 8 ఓవర్లు మెయిడిన్లు వేశాడు. అలాగే కపిల్ దేవ్ కూడా 8 ఓవర్లు మెయిడిన్ బౌలింగ్ చేశాడు. ఇక అయాన్ విషయానికొస్తే, ఈ ఆటగాడు గత సంవత్సరం కేవలం 16 సంవత్సరాల వయస్సులో T20 ప్రపంచకప్ ఆడాడు. అయాన్ అత్యుత్తమ ఆల్‌రౌండర్, ODIలలో అతడి సగటు 35 కంటే ఎక్కువ. అదే సమయంలో, అతడు 15 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీశాడు.
కాగా, అయాన్ బౌలింగ్‌తో యూఏఈ భారీ విజయాన్ని అందుకుంది. అయాన్ అద్భుత బౌలింగ్‌తో పాటు వికెట్‌కీపర్ అరవింద్, రోహన్ ముస్తఫా కూడా అర్ధసెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూఏఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో యూఏఈ 4 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. అదే సమయంలో, బహ్రెయిన్ జట్టు 4 మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచింది.
So Aayan Afzal Khan (17yrs 162days) has four for four in eight overs against Bahrain at the moment. Including this. Ridiculous pic.twitter.com/iNdWoXLHAb
— Paul Radley (@PaulRadley) April 26, 2023